దేవర పాటకు స్పైడర్‌ మ్యాన్‌, హల్క్‌, డెడ్‌పూల్‌ డాన్స్‌

సోషల్‌ మీడియాలో రెండు పాటలు ఏ స్థాయిలో ట్రెండ్‌ అయ్యాయో తెల్సిందే.

Update: 2024-11-13 11:49 GMT

ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్న ఈ సినిమాను తాజాగా ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌ మొదలు అయింది. థియేటర్‌ రిలీజ్‌తో భారీ వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా ఓటీటీలోనూ అత్యధిక వ్యూస్‌ని రాబడుతూ ట్రెండ్‌ అవుతుంది. ఈ సినిమాలో ఉన్న రెండు రొమాంటిక్ పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. సోషల్‌ మీడియాలో రెండు పాటలు ఏ స్థాయిలో ట్రెండ్‌ అయ్యాయో తెల్సిందే.

సినిమా విడుదల తర్వాత కూడా చుట్టమల్లే పాటతో పాటు దావుదీ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంది. తాజాగా కేరళకు చెందిన ఒక ఔత్సాహికుడు ఏఐ టూల్ ద్వారా చుట్టమల్లే సాంగ్‌ కి ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ ఎలా అయితే స్టెప్స్ వేశారో అలాగా హాలీవుడ్‌ హీరోలు అయిన స్పైడర్‌ మ్యాన్‌, డెడ్‌ పూల్‌తో చేయించాడు. మధ్యలో హల్క్ సైతం రావడం జరిగింది. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెట్టింట ఇప్పటి వరకు ఎన్నో చుట్టమల్లే రీల్‌ వీడియోలు చూడటం జరిగింది.. కానీ ఇది చాలా స్పెషల్‌గా ఉందని, ఎన్టీఆర్‌ అంటే ఎంత అభిమానం ఉంటే ఇలాంటి వీడియోలు చేస్తారంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ డ్యూయెల్‌ రోల్‌లో నటించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ పాత్ర నిడివి కాస్త ఎక్కువ ఉంటే బాగుండేది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఆమె పాటలు రెండు సైతం అద్భుతంగా ఉన్నాయంటూ మొదటి నుంచి ప్రేక్షకులు చెబుతూ వస్తున్నారు. సినిమాకు సైతం ఆ రెండు పాటలు ప్లస్‌గా నిలిచాయి. బ్లాక్‌బస్టర్‌ దేవర సినిమా నుంచి రెండో పార్ట్ రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో దేవర పార్ట్‌ 2 కి సంబంధించిన వర్క్ స్టార్ట్‌ చేస్తామని దర్శకుడు కొరటాల శివ అధికారికంగా ప్రకటించాడు.

దేవర సినిమాకు అనిరుధ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం సినిమా ను ఓటీటీ లో ప్రేక్షకులు తెగ చూస్తున్నారు అంటే కారణం అనిరుధ్‌ సంగీతం కూడా అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో కీలక పాత్రను సైఫ్ అలీ ఖాన్‌ పోషించడం ద్వారా ఉత్తరాది ప్రేక్షకులు సైతం ఆధరిస్తున్నారు. సినిమా ఫస్ట్‌ హాఫ్ లో ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ల లవ్‌, రొమాంటిక్‌ సీన్స్ ఉంటే కచ్చితంగా ఇది వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సొంతం చేసుకునేది అంటూ ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూలో చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News