చుట్టమల్లే సాంగ్.. మరో టాప్ రికార్డ్

దేవర సినిమాలోని సెకండ్ సింగిల్ గా రిలీజ్ అయిన చుట్టమల్లే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

Update: 2024-09-11 11:21 GMT

దేవర సినిమాలోని సెకండ్ సింగిల్ గా రిలీజ్ అయిన చుట్టమల్లే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రీ లిరిక్స్ రాశారు. ఈ పాటని ప్రముఖ గాయని శిల్పారావు ఏకంగా నాలుగు భాషలలో ఆలపించింది. ఒక్క తమిళంలోనే దీప్తి సురేష్ ఆలపించారు. చుట్టమల్లే సాంగ్ ట్యూన్ కాపీ అంటూ విమర్శలు విమర్శలు వచ్చాయి.

అయినా కూడా సాంగ్ కి మంచి ఆదరణ లభించింది. యుట్యూబ్ లో 100 మిలియన్స్ కి పైగా వ్యూవ్స్ ని ఈ సాంగ్ సొంతం చేసుకుంది. దీనిని బట్టి సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే చుట్టమల్లే సాంగ్ మరో రేర్ ఫీట్ కూడా అందుకుంది. ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్ యాప్ స్పాటిఫై(spotify) లో చుట్టమల్లే సాంగ్ ఏకంగా 25 మిలియన్స్ ని క్రాస్ చేసింది.

ఈ మధ్యకాలంలో అత్యధిక స్ట్రీమింగ్స్ ని సొంతం చేసుకున్న పాటగా స్పాటిఫై లో ఈ సాంగ్ నిలిచింది. మొదటి సారిగా అనిరుద్ కంపోజ్ చేసిన తెలుగు సాంగ్స్ నేషనల్ వైడ్ గా ట్రేడ్ అవ్వడం దేవరతోనే సాధ్యమే అయ్యింది. ఈ సాంగ్స్ తో మూవీ పైన ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా అనిరుద్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కంటెంట్ టెంపోని ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా చేసిందనే మాట వినిపిస్తోంది.

కచ్చితంగా అనిరుద్ మ్యూజిక్ దేవర సినిమాకి చాలా అడ్వాంటేజ్ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. గత ఏడాది జైలర్, లియో సినిమాలకి అనిరుద్ అందించిన మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యింది. ఆ సినిమాల సక్సెస్ లో కూడా అనిరుద్ మ్యూజిక్ కి క్రెడిట్ లభించింది. అలాగే దేవర సినిమాలోని సాంగ్స్, బ్యాగ్రౌండ్ కి కచ్చితంగా మంచి ప్రశంసలు లభించే అవకాశం ఉందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

అలాగే చుట్టమల్లే సాంగ్ తో పాటు తరువాత వచ్చిన దావుదీ పాటలో హీరోయిన్ జాన్వీ కపూర్ ని చాలా అందంగా రిప్రజెంట్ చేశారు. ఈ పాటలకి జాన్వీ కపూర్ అందం అదనపు ఆకర్షణ తీసుకొచ్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. బిగ్ స్క్రీన్ పైన ఈ సాంగ్స్ రెండు కనులవిందు కలిగించడం గ్యారెంటీ అని భావిస్తున్నారు.

Tags:    

Similar News