ఆ రెండిటి తర్వాత శ్రీలీల భవిష్యత్తు ఏంటో..?
ధమాకా తర్వాత వరుసగా ఎనిమిది అవకాశాలు అందుకున్న అమ్మడు వాటిలో ఇప్పటివరకు రిలీజైన ఐదు సినిమాల్లో భగవంత్ కేసరి తప్ప అన్నీ ఫ్లాపులే ఫేస్ చేసింది.
శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక లీడ్ రోల్ లో వచ్చిన పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల అంతకుముందు కన్నడలో చేసిన ఒకటి రెండు సినిమాలకే సూపర్ క్రేజ్ సంపాదించింది. ఇక తెలుగులో ఎంట్రీ ఇవ్వడమే రాఘవేంద్ర రావు చేతుల్లో పడ్డ అమ్మడు ఆ వెంటనే మాస్ మహారాజ్ రవితేజ తో ధమాకా సినిమా చేసింది. ఆ సినిమాతో అమ్మడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ధమాకా హిట్ లో శ్రీలీల కూడా మేజర్ రోల్ పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత శ్రీ లీల వరుస సినిమాలు చేస్తూ వస్తుంది.
రాం తో చేసిన స్కంద ఫ్లాప్ అవగా బాలకృష్ణ తో చేసిన భగవంత్ కేసరి సినిమా హిట్ అయ్యింది. మళ్లీ వైష్ణవ్ తేజ్ తో చేసిన ఆదికేశవ, నితిన్ తో కలిసి నటించిన ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం శ్రీ లీల ఆశలన్నీ కూడా మహేష్ గుంటూరు కారం మీదే ఉన్నాయి. త్రివిక్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మొదట శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా అనుకున్నా పూజా హెగ్దే ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అవడం తో శ్రీ లీల మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది.
మహేష్ గుంటూరు కారం సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది శ్రీ లీల. ఈ సినిమా ప్రచార చిత్రాలు కూడా భారీ హైప్ తీసుకొచ్చాయి. సంక్రాంతి బాక్సాఫీస్ మొనగాడుగా మహేష్ నిలబడతాడని చెప్పుకుంటున్నారు. అలా అయితే శ్రీ లీల ఖాతాలో మరో హిట్ పడినట్టే లెక్క. ఇక ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా లైన్ లో ఉంది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు చాలా టైం ఉంది. అయితే ఈమధ్యలో శ్రీ లీలకు మరో అవకాశం రాలేదు. ధమాకా తర్వాత వరుసగా ఎనిమిది అవకాశాలు అందుకున్న అమ్మడు వాటిలో ఇప్పటివరకు రిలీజైన ఐదు సినిమాల్లో భగవంత్ కేసరి తప్ప అన్నీ ఫ్లాపులే ఫేస్ చేసింది. గుంటూరు కారం హిట్ పడినా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా హిట్ పడితేనే శ్రీ లీల కెరీర్ మళ్లీ నిలబడుతుంది.
ఈ రెండు సినిమాల తర్వాత శ్రీ లీల మరో సినిమా సైన్ చేయలేదు. విజయ్ దేవరకొండతో సినిమా చేయాల్సి ఉన్నా అది కాస్త మిస్ అయ్యింది. శ్రీ లీల భవిష్యత్తు డిసైడ్ చేయనున్న ఈ రెండు సినిమాలు ఆమెను తిరిగి ఫాం లోకి తెస్తాయా లేదా అన్నది చూడాలి.