హీరో కంటే విల‌న్ బెట‌ర్ అంటావా?

ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా- ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌తో ఆయ‌న అనుబంధం దాదాపు మూడు దశాబ్ధాలుగా సాగుతుంది.

Update: 2023-12-06 07:19 GMT

ఛార్మింగ్ స్టార్ శ్రీకాంత్ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. విల‌న్ గా ప్రారంభ‌మై హీరోగా స‌క్సెస్ అయిన న‌టుడు. వెండి తెర‌పై హీరోగా ఓ వెలుగు వెలిగిన న‌టుడు. ఫ్యామిలీ హీరో అంటే ఒక‌ప్పుడు ద‌ర్శ‌కులకు శ్రీకాంత్..జ‌గ‌ప‌తి బాబు లాంటి వారే ఆప్ష‌న్. హీరోగా ఎన్నో సినిమాల్లో న‌టించి ఫ్యామిలీ హీరోగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ను ద‌క్కించుకున్నాడు. కుటుంబ నేప‌థ్యంగల సినిమాల‌కు ఆద‌ర‌ణ త‌గ్గ‌డంతో శ్రీకాంత్ కూడా కెరీర్ ప‌రంగా ట‌ర్నింగ్ తీసుకుని ముందుకెళ్తున్నారు.


ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా- ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌తో ఆయ‌న అనుబంధం దాదాపు మూడు దశాబ్ధాలుగా సాగుతుంది. చాలా వేగంగానే 100 సినిమాలకు పైగా పూర్తి చేసారు. వాటిలో ఎన్నో ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లున్నాయి. ప్ర‌స్తుతం సెకెండ్ ఇన్సింగ్స్ ని కొన‌సాగిస్తున్నాడు. వ‌చ్చిన ఎలాంటి పాత్ర అయినా చేస్తున్నాడు. 'అఖండ' లాంటి చిత్రం శ్రీకాంత్ కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చింది.

అలాగే ఇటీవ‌లే రిలీజ్ అయిన 'కోట‌బొమ్మాళి పీఎస్' తోనూ మంచి విజ‌యాన్ని ఖాతా లో వేసుకున్నాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో జ‌ర్నీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ఆవేంటో ఆయ‌న మాట‌ల్లోనే..

'గతంలో నేను న‌టించిన 'ఆపరేషన్ దుర్యోధన' సినిమాలో నా లుక్ చూసి.. బోయపాటి నాకు 'అఖండ' లో ఛాన్స్ ఇచ్చారు. తొలి నుంచి నేను ఎలాంటి పాత్ర అయినా చేయ‌గ‌ల‌ను అన్న న‌మ్మ‌కం నాలో ఉంది.

అందుకే ఆ రోల్ గురించి చెప్ప‌గానే ఒకే చెప్పాను. ఆ నమ్మకమే నన్ను ఇక్కడి వరకూ తీసుకొచ్చింది. హీరోగా 25 సంవత్సరాల పాటు కొన‌సాగాను. ఇప్పుడు నా స్థాయికి తగిన ముఖ్యమైన రోల్స్ చేస్తున్నాను. హీరోగా చేస్తున్నప్పుడు చాలా టెన్షన్స్ ఉండేది. ఇప్పుడు అలాంటి టెన్షన్స్ లేవు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు అన్ని ర‌కాలుగా చాలా రిలాక్స్ గా ఉంటున్నాను. డబ్బు పరంగా .. టెన్షన్స్ పరంగా ఇప్పుడే బెటర్ గా ఉన్నాను అనిపిస్తుంది. రోషన్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో నాకు మరింత సంతోషంగా ఉంది' అని అన్నారు.

Tags:    

Similar News