శ్రీమతి గారితో 'లక్కీ భాస్కర్'.. ఓ ప్రేమ గొడవ

''లక్కీ భాస్కర్''లో దుల్కర్ సల్మాన్ బ్యాంక్ క్యాషియర్ పాత్రలో కనిపిస్తున్నారు.

Update: 2024-06-19 08:25 GMT

మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ అందుకుంటున్న విషయన్ తెలిసిందే. ఇక అతని కొత్త చిత్రం "లక్కీ భాస్కర్" రెండు భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. ఈ సినిమా నుంచి "శ్రీమతి గారు" అనే మొదటి పాట విడుదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. "మహానటి" "సీతా రామం" వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న దుల్కర్, ఈసారి మరింత విభిన్నమైన పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు.


''లక్కీ భాస్కర్''లో దుల్కర్ సల్మాన్ బ్యాంక్ క్యాషియర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ పాత్రలో ఆయన కొత్త అవతారంలో కనిపించనున్నారు. గతంలో ఎన్నడూ చూడని ఈ పాత్రలో ఆయనకు టీజర్ ద్వారా మంచి స్పందన లభించింది. ఈ చిత్రం నుంచి జూన్ 19న విడుదలైన మొదటి పాట "శ్రీమతి గారు" మెలోడీగా ఎంతో ఆకట్టుకుంటోంది.

జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ పాట, వినసొంపైన వయోలిన్, ఫ్లూట్ మెలోడీలతో మిళితమై ఉంది. స్వీట్ ట్యూన్ తో ప్రేక్షకుల హృదయాలను తాకింది. విశాల్ మిశ్రా మరియు శ్వేతా మోహన్ ఈ పాటను చక్కగా ఆలపించారు. "శ్రీమతి గారు" పాటలో శ్రీమణి అందించిన సాహిత్యం, అర్ధవంతమైన పదాలతో అనుభూతిని కలిగిస్తుంది. భర్త, భార్య మధ్య ఉన్న ప్రేమను మరియు వైవాహిక జీవితంలో ఎదురయ్యే తీయని తగాదాలను చక్కగా ఆవిష్కరించిన ఈ పాట, ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది.

"కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడం గారు" వంటి పదాలు ఈ పాటను అందరికి నచ్చేలా చేస్తాయి. ''లక్కీ భాస్కర్'' చిత్రంలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. 1980-90 ల కాలంలో సాధారణ బ్యాంక్ క్యాషియర్‌గా ఉన్న ఒక వ్యక్తి అసాధారణ విజయాన్ని ఎలా సాధించాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ చిత్రానికి నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, బంగ్లాన్ ఆర్ట్ డైరెక్టర్ గా, మరియు నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Full View


Tags:    

Similar News