ఇండియన్ 2 : ప్రపంచంలో ఎక్కడ ట్రై చేయలేదు

హాలీవుడ్‌ సినిమాలకు వర్క్ చేసే ఎంతో మంది ఇండియన్ సినిమాల కోసం వర్క్ చేస్తున్నారు

Update: 2024-07-02 15:30 GMT

ఇండియన్ సినిమా స్థాయి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కల్కి సినిమాను చూస్తూ ఉంటే ఒక హాలీవుడ్‌ సినిమాను చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది అంటూ స్వయంగా హాలీవుడ్‌ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఇక ముందు హాలీవుడ్‌ సినిమాలు సైతం చిన్నబోయే విధంగా ఇండియన్ సినిమాలు ఉండబోతున్నాయి అనే నమ్మకం కలుగుతుంది.

హాలీవుడ్‌ సినిమాలకు వర్క్ చేసే ఎంతో మంది ఇండియన్ సినిమాల కోసం వర్క్ చేస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమాలు హాలీవుడ్‌ రేంజ్ లో ఉంటున్నాయి. అయితే ఇండియన్ 2 సినిమా మాత్రం హాలీవుడ్‌ స్థాయిని మించి ఉంటుంది అంటూ వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్‌ అన్నారు.

ఈయన భారతీయుడు 2 సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్నాడు. సినిమా విడుదల నేపథ్యంలో ఒక ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సినిమా వర్క్‌ జరుగుతున్న సమయంలో ఒక రోజు నాకు శంకర్ గారు కాల్‌ చేసి ఆయన ఐడియా చెప్పారు. నేను సర్‌ప్రైజ్ అయ్యాను.

ఇప్పటి వరకు అలాంటిది హాలీవుడ్‌ లోనే కాదు ప్రపంచంలో ఏ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ట్రై చేయలేదు. అలాంటి ఒక ఐడియా రావడం అనేది గొప్ప విషయం. ఇక ముందు హాలీవుడ్‌ వారు కూడా అలాంటి కాన్సెప్ట్‌ లతో ముందుకు వెళ్తారు అన్నట్లుగా శ్రీనివాస్‌ మోహన్‌ అన్నారు.

కమల్‌ హాసన్ హీరోగా నటించిన ఇండియన్ 2 ను ఈ నెల రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వెయ్యి కోట్ల టార్గెట్‌ తో విడుదల అవ్వబోతున్న ఇండియన్ 2 పై శ్రీనివాస్‌ మోహన్ వ్యాఖ్యలు మరింత అంచనాలు పెంచాయి.

Tags:    

Similar News

eac