మ‌గాడా? కాదా? అన్న‌ది పెళ్లికి ముందే తెలుసుకోవాలి!

తాజాగా హ‌ట్ బ్యూటీ శ్రీరాపాక పెళ్లికి ముందు శృంగారం గురించి బోల్డ్ గా మాట్లాడింది.

Update: 2023-08-12 05:57 GMT

సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ ఒక్క‌డే వివాదాస్ప‌దుడు అంటే త‌ప్పు! ఆయ‌న‌తో పాటు ఆయ‌న ప‌రిచ‌యం చేసిన హీరోయిన్లు కూడా కొంద‌రు ఆయ‌న‌లాగే ఉన్నార‌ని కొంత మంది భామ‌ల్లో ప్రూవ్ అయింది. అందుకే వ‌ర్మ ప‌ల్స్ ప‌ట్టుకుని జ‌ర్నీ చేయ‌గ‌ల్గుతున్నారు. అందాల ప్ర‌ద‌ర్శ‌న ప‌క్క‌న‌బెడితే ఆయ‌న త‌ర‌హాలోనే అప్పుడ‌ప్పుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తోనూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. తాజాగా హ‌ట్ బ్యూటీ శ్రీరాపాక పెళ్లికి ముందు శృంగారం గురించి బోల్డ్ గా మాట్లాడింది.

మ్యారేజ్ కి ముందు శృంగారంలో పాల్గొనడంలో తప్పులేదని.. అందులో పాల్గొంటేనే అతను మగాడా? కాదా? అనే విషయం తెలుస్తుంద‌ని అంది. పెళ్లి జరిగిన తర్వాత అతను మగాడు కాదని తెలిస్తే జీవితాంతం బాధ పడాల్సి వస్తుంది. అదే విష‌యం పెళ్లికి ముందే తెలిస్తే ఆ జీవితం మ‌రోలా ఉంటుందంది. దీనికి సాక్షంగా త‌న స్నేహితురాలి జీవితాన్ని ఉద‌హ‌రించింది.

ఇదే సమయంలో తన స్నేహితురాలికి జరిగిన ఒక అనుభవం గురించి తెలిపింది. `నా స్నేహితురాలు పెళ్లి చేసుకుంది. తొలి రాత్రి అత‌డు గే అని తెలిసింది. ఈ విష‌యం నాకు చెప్పి నా స్నేహితురాలు ఎంతో బాధ‌ప‌డింది. ఈరోజుల్లో ఇలాంటి వాటి విష‌యంలో చాలా జాగ్ర‌త్తగా ఉండాలి. ఇలాంటి ఘ‌న‌ట‌లు రోజు పేప‌ర్లో...టీవీలో వ‌స్తునే ఉన్నాయి.

ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో భార్య‌భ‌ర్త‌ల బంధాలు వీగిపోతున్నాయి. విదేశీ సంబంధాలు అంటూ అలాగే మోసపోతున్నారు. అబ్బాయిల‌ది మాత్ర‌మే త‌ప్పు అన‌లేదు. అమ్మాయిలు అలాగే ఉన్నారు. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో వివాహ వ్య‌వ‌స్త‌లు కూలిపోతున్నాయి. ఈ విధానం మారాల‌ని నేను కోరుకుంటున్నా` అని తెలిపింది.

వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `న‌గ్నం` సినిమాతో ఈ బ్యూటీ పాపుల‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత అమ్మ‌డు సోష‌ల్ మీడియా లో మంచి ప్రాచుర్యం పొందింది. టెంప్టింగ్ ఫోటోల‌తో యువ‌త‌ని ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌ట్టుకుంటుంది. అప్పుడ‌ప్పుడు ఇలా వ‌ర్మ త‌ర‌హా కామెంట్ల‌తోనూ ఆస‌క్తిక‌రంగా మారుతుంది.

Tags:    

Similar News