SSMB29: లేటెస్ట్ బజ్ ఏమిటంటే..

ఇప్పటికే లాంగ్ హెయిర్ స్టైల్, పొడవైన గెడ్డంతో మహేష్ మ్యాన్లీగా కనిపిస్తున్నాడు.

Update: 2024-09-27 04:15 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ దర్శక ధీరుడు రాజమౌళితో చేయబోయే ‘SSMB29’ కోసం ఇప్పటికే రెడీ అయిపోయాడు. పెర్ఫెక్ట్ మేకోవర్ తో మహేష్ బాబు కనిపిస్తున్నాడు. ఇదివరకు ఎన్నడూ చూడని సరికొత్త పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఉంటాడనే మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే లాంగ్ హెయిర్ స్టైల్, పొడవైన గెడ్డంతో మహేష్ మ్యాన్లీగా కనిపిస్తున్నాడు.

ఇక జక్కన్న నుంచి ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కచ్చితంగా ‘SSMB29’ వండర్స్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ‘SSMB29’ మూవీ ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందనే ప్రచారం జరిగిన రాజమౌళి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ సినిమా వర్క్ ఎలా నడుస్తుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అందరిలో ఉంది.

త్వరలో SSMB29 గురించి రాజమౌళి ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది. అలాగే జక్కన్న ఈ సినిమా ప్రొడక్షన్ లో హాలీవుడ్ నిర్మాణ సంస్థని భాగం చేసే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం గతంలో జరిగింది. దాంతో పాటు మూవీలో కీలక పాత్రల కోసం యాక్టర్స్ ని ఫైనల్ చేస్తున్నారని టాక్ నడిచింది.

చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్ పేర్లు ‘SSMB29’ చిత్రం కోసం వినిపించాయి. ఫైనల్ గా జక్కన్న మూవీ క్యాస్టింగ్ మొత్తం ఖరారు చేశారని ఇప్పుడో కొత్త న్యూస్ వినిపిస్తోంది. రాజమౌళి ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ స్పీడ్ అప్ చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. మూవీ క్యాస్టింగ్ ఆల్ మోస్ట్ లాక్ అయ్యిందంట. త్వరలో దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం ఇండస్ట్రీలో నడుస్తోంది.

అయితే రాజమౌళి ఎప్పుడు ‘SSMB29’ మూవీ అప్డేట్ ఇస్తాడనే ఆసక్తి అందరిలో ఉంది. ఒకసారి ఈ సినిమా అప్డేట్స్ ని రివీల్ చేసిన తర్వాత బ్యాక్ టూ బ్యాక్ అన్ని విషయాలపై జక్కన్న స్పష్టత ఇస్తాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలో మూవీ బడ్జెట్ పైన కూడా పూర్తిస్థాయిలో స్పష్టత రావొచ్చని సమాచారం.

Tags:    

Similar News