SSMB29 జూలై అప్‌డేట్‌.. జక్కన్న ఏం చేస్తున్నాడంటే!

కానీ తాజా పరిణామాలు చూస్తూ ఉంటే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆరంభ దశలోనే ఉంది. ఇటీవల కథ కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది.

Update: 2024-07-01 14:50 GMT

బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న సినిమా పై అందరి దృష్టి ఉంది. ఇప్పటికే మహేష్ బాబుతో సినిమా ను ప్రకటించిన రాజమౌళి ఆ పనిలో బిజీగా ఉన్నాడు.

ఆర్ఆర్‌ఆర్ విడుదల అయ్యి నెలలు, సంవత్సరాలు గడిచి పోతున్నా కూడా హడావిడి లేకుండా మెల్లగానే మహేష్ బాబుతో సినిమా ని చేయాలి అనేది రాజమౌళి అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే కథ కోసం ఏకంగా ఏడాది సమయం తీసుకున్నాడు. ఇటీవలే కథ లాక్ అయ్యిందని కీరవాణి అధికారికంగా వెల్లడించారు.

జులై నెలలో సినిమా కి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం అవుతాయని కీరవాణి చెప్పుకొచ్చారు. కానీ తాజా పరిణామాలు చూస్తూ ఉంటే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆరంభ దశలోనే ఉంది. ఇటీవల కథ కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది.

మహేష్ బాబు తప్ప ఇప్పటివరకు హీరోయిన్ కానీ, ఇతర నటీనటులు కానీ ఎంపిక అవ్వలేదు. ప్రతి ఒక్క నటి నటులకు స్క్రీన్ టెస్ట్‌ పెట్టి, వాళ్లు అందులో సంతృప్తి పరచితేనే రాజమౌళి వాళ్లను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే కనీసం ఆరు నెలలు నటీనటుల ఎంపిక కోసం కసరత్తు జరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

Read more!

మరో వైపు సినిమా కోసం సెట్స్ వర్క్ ను మొదలు పెట్టించే అవకాశాలు ఉన్నాయి. రాజమౌళి సినిమా లు ఎక్కువగా సెట్స్ లో జరుగుతాయి. అయితే ఈసారి అలా కాదనే వార్తలు వస్తున్నాయి. కొంతలో కొంత అయినా సెట్స్ లో షూట్‌ చేస్తారు. కనుక అందుకోసం సెట్స్ నిర్మాణం మొదలు పెట్టబోతున్నారు.

హాలీవుడ్‌ రేంజ్ అడ్వంచర్‌ మూవీగా ఈ సినిమా ఉంటుంది అంటూ జక్కన్న సన్నిహితులు చెబుతున్నారు. కల్కి సినిమాతో హాలీవుడ్‌ సినిమాలను మరిపించిన నాగ్‌ అశ్విన్‌ ను మించి రాజమౌళి ఏదో అద్భుతం చేస్తాడనే నమ్మకం అందరిలో కనిపిస్తోంది.

Tags:    

Similar News