నన్ను పెట్టుకుని అలా అంటావేంటన్న జక్కన్న..!
మలయాళ లో సూపర్ హిట్ అయిన ప్రేమలు సినిమా తెలుగులో రీసెంట్ గా రిలీజై సో సో గా రన్ అవుతుంది
మలయాళ లో సూపర్ హిట్ అయిన ప్రేమలు సినిమా తెలుగులో రీసెంట్ గా రిలీజై సో సో గా రన్ అవుతుంది. మలయాళంలో లాస్ట్ మంత్ రిలీజైన ఈ సినిమా రాజమౌళి తనయుడు కార్తికేయ దృష్టిలో పడింది. అతను ఈ సినిమా డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేశాడు. సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు సైలెంట్ గానే చేసిన కార్తికేయ ట్రైలర్ తో సినిమాపై బజ్ ఏర్పడేలా చేశాడు. ముఖ్యంగా RRR తొక్కుకుంటూ పోవాలి.. కుమారి ఆంటీ డైలాగ్స్ పెట్టి ట్రైలర్ ఆసక్తికరంగా కట్ చేశారు. సినిమాను తన సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేస్తూ వచ్చాడు. ఫలితంగా సినిమా చూసిన ఆడియన్స్ అంతా ఇదొక మంచి ఫన్ రైడ్ అని ఎంజాయ్ చేస్తున్నారు.
మౌత్ టాక్ తో నడుస్తున్న జోష్ మరింత పెంచేలా ఈ సినిమా కోసం ఒక స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేశాడు కార్తికేయ. ఈ ఈవెంట్ కు రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ కార్యక్రమంలో సినిమా డబ్బింగ్ కార్యక్రమాలన్నీ చాలా స్పీడ్ గా పూర్తి చేసి రిలీజ్ చేశామని కార్తికేయ చెప్పుకొచ్చాడు. అయితే అలా కార్తికేయ మాట్లాడుతుండగానే వెనక మైక్ అందుకుని రేయ్ నన్ను వెనకాలే పెట్టుకుని ఫాస్ట్ గా చేశాం.. వారం రోజుల్లో రిలీజ్ చేశామని చెప్పకురా అని అన్నారు రాజమౌళి.
రాజమౌళి అలా చెప్పడం వెనుక రీజన్ అందరికీ తెలిసిందే. తన ప్రతి సినిమాకు కనీసం రెండు మూడేళ్లు టైం తీసుకునే రాజమౌళి సినిమా మొదలు పెట్టే టైం లో చెప్పిన రిలీజ్ డేట్ కి ఎన్ని వాయిదాలు పడతాయో తెలియదు. ఫైనల్ గా ప్రాజెక్ట్ పై ఆడియన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకుంటారో వాటికి ఒక మెట్టు ఎక్కువగానే ఉంచుతాడు జక్కన్న. అలా తీర్చిదిద్దుతాడు కాబట్టే ఆయన ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని ఏళ్లు టైం తీసుకున్నా ఎవరు ప్రశ్నించరు.
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేలా చేసిన రాజమౌళి సినిమాను త్వరగా పూర్తి చేసిన వారిని ప్రశంసిస్తుంటారు. ఇంతకుముందు పూరీ జగన్నాథ్ గురించి కూడా ఈ విధంగానే స్పందించారు జక్కన్న. పూరీ దగ్గర తను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరతానని ఆయనలా సినిమా త్వరగా పూర్తి చేయడం నేర్చుకోవాలని అన్నారు రాజమౌళి. మొత్తానికి ప్రేమలు వేడుక సందర్భంగా మరోసారి రాజమౌళి సినిమా వర్కింగ్ డేస్ పై సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి.
ప్రేమలు సినిమా గురించి రాజమౌళి ఇచ్చిన స్పీచ్ కూడా ఆడియన్స్ ని అలరించింది. తనకు లవ్ స్టోరీస్ నచ్చవు కానీ ఈ సినిమా చూసి బాగా ఎంటర్టైన్ అయ్యానని అన్నారు. సినిమాలో నటించిన కాస్టింగ్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు రాజమౌళి. గీతాంజలి గిరిజ, సాయి పల్లవిలా మమిత కూడా మంచి పేరు తెచ్చుకుంటుందని అన్నారు.