VD 12 : విజయ్ కోసం రణబీర్, సూర్య, తారక్!
నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం చివరి దశలో ఉంది.
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు VD 12 ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం చివరి దశలో ఉంది. దీంతో మరికొద్ది రోజుల్లో మేకర్స్.. చిత్రీకరణకు గుమ్మడి కాయ కొట్టనున్నారు.
అయితే సినిమా నుంచి ఇప్పటి వరకు విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మరో అప్డేట్ రాలేదు. తక్కువ జుట్టుతో గట్టిగా అరుస్తున్న విజయ్ లుక్ మూవీపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు.. అప్డేట్స్ ను మేకర్స్ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
అదే సమయంలో రీసెంట్ గా విజయ్ క్రేజీ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 12వ తేదీ స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు అనౌన్స్ చేశారు. టైటిల్ తో పాటు టీజర్ ను రివీల్ చేయనున్నట్లు తెలిపారు. పవర్ ఫుల్ పోస్టర్ ను షేర్ చేసి మరింత హైప్ క్రియేట్ చేశారు. అందులో మంటల్లో బంగారు కిరీటం ఉన్నట్లు కనిపిస్తోంది.
పోస్టర్ పై "ఈ కిరీటం రాజు కోసం వెయిట్ చేస్తుంది" అంటూ మేకర్స్ ఇచ్చిన రైటప్ ఆసక్తి రేపుతోంది. దాంతోపాటు మా ప్రపంచం, మా కథ తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ విజయ్ రాసుకొచ్చారు. దీంతో టీజర్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు నెట్టింట మరో వార్త చక్కర్లు కొడుతోంది.
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్న VD 12 టీజర్ హిందీ వెర్షన్ కు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించినట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ నిన్న ముంబైలో వాయిస్ ఓవర్ డబ్బింగ్ పూర్తి చేశారని టాక్ వినిపిస్తోంది. మిగిలిన లాంగ్వేజెస్ లో కూడా ప్రముఖులు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు సమాచారం.
టీజర్ తెలుగు వెర్షన్ కోసం జూనియర్ ఎన్టీఆర్.. తమిళ వెర్షన్ కోసం సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో విజయ్ కోసం రణబీర్, తారక్, సూర్య రంగంలో దిగారన్నమాట. కానీ మేకర్స్ ఇంకా అధికారికంగా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. త్వరలోనే రివీల్ చేయనున్నారని తెలుస్తోంది.
ఇక సినిమా విషయానికొస్తే.. యంగ్ బ్యూటీ శ్రీలీలను హీరోయిన్ గా మేకర్స్ సెలెక్ట్ చేయగా ఆమె తప్పుకుంది. ఇప్పుడు భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి VD 12 టైటిల్ ఏంటో.. టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.