ఆ స్టార్ డైరెక్టర్ తనయుడు ప్రేమలో పడ్డాడా?
టాలీవుడ్ లో అతనో స్టార్ డైరెక్టర్ . ఈ మధ్య కాలంలో రేసులో వెనుకబడ్డాడు గానీ..ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించిన మేకర్
టాలీవుడ్ లో అతనో స్టార్ డైరెక్టర్ . ఈ మధ్య కాలంలో రేసులో వెనుకబడ్డాడు గానీ..ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించిన మేకర్. ఎంతో మంది స్టార్లని తయారు చేసిన దర్శకుడు. కానీ తనయుడిని మాత్రం ఇంకా స్టార్ గా మార్కెట్ లోకి తీసుకురాలేకపోతున్నాడు. ఇప్పటికే ఓ సినిమా కూడా చేసాడు. అది ఫెయి లైంది. అటుపై తను కథలు అందిస్తూ...కొత్త దర్శకులతోనూ ప్రయోగం చేయించాడు.
ఆ ప్రయత్నాలు కూడా ఫెయిలయ్యాయి. దీంతో తనయుడిని తాత్కలికంగా పక్కనబెట్టి తాను సక్సెస్ అయ్యే ప్రయత్నాల్లో బిజీ అయ్యాడు. ఈ క్రమంలో కొన్నాళ్లు ముంబైలోనూ మకాం పెట్టాడు. తీసిన సినిమాలు నష్టాల తేవడంతో అక్కడ ఆఫీస్ ఖాళీ చేసి మళ్లీ హైదరాబాద్ కి షిప్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఇక్కడే ఉంటూ ఓ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక తనయుడు నుంచి అయితే సినిమాల పరంగా ఎలాంటి అప్ డేట్ రాలేదు.
కొత్త ప్రాజెక్ట్ ప్రకటిస్తాడని అభిమానులు ఆశిస్తున్నా? ఆ ఘట్టం ఇంకా చోటు చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అదే తనయుడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీకైంది. ఆ యువ నటుడు అప్పుడే ప్రేమ లో పడ్డాడు అంటూ ఓ వార్త నెట్టింట చక్కెర్లు కొడుతుంది. కొన్ని నెలలుగా ఓ యువతితో ప్రేమ పాఠాల్లో బిజీగా ఉన్నా డని...త్వరలో పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీ అవుతున్నాడని ప్రచారం సాగుతోంది.
ఈ వ్యవహారం తల్లిదండ్రులు..పెద్దల వరకూ వెళ్లిందా? లేదా? అన్నది తెలియదు గానీ కుర్ర హీరో మాత్రం ప్రేమలో చాలా స్పీడ్ గానే ఉన్నాడని ప్రచారం సాగుతోంది. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియాలి. యువ నటుడు ఇప్పుడిప్పుడే కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్నాడు. నటుడిగా తనకంటూ కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నాడు. తండ్రి పేరు చెప్పుకునేలా తనయుడు ఎదిగి చూపిస్తానని ప్రామిస్ కూడా చేసాడు. మరి ఈ రకమైన సీరియస్ జర్నీలో ప్రేమ అనేది నిజమైతే దాన్ని సక్సెస్ చేసుకుని ....కెరీర్ వైపు గా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు? సక్సెస్ డెసిషన్స్ అనేవి ఎలా ఉంటాయి? అన్నది చూడాలి.