రిపోర్టర్ ని సినిమా ఛాన్స్ అడిగిన స్టార్ హీరో!
అది కార్తీ అవకాశం ఇవ్వడంతో వచ్చిన అవకాశం లేకపోతే ఆయన ఇంకా ఖాళీగానే ఉండాల్సిన సన్నివేశం.
ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని స్టార్ హీరోల వెంట డైరెక్టర్లు పడతారు. ఛాన్స్ ఇస్తే నిరూపించుకుని నమ్మకాన్ని నిలబెడతామని చెబుతుంటారు. ఇలా అవకాశం కోసం ఎదిగే డైరెక్టర్ ఎవరైనా? హీరోల వెంట తిరగాల్సిందే. కానీ ఇక్కడ సన్నివేశం అందుకు రివర్స్ లో కనిపిస్తుంది. అవును ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని డైరెక్టర్ అడగలేదు. ఆ స్టార్ హీరోనే డైరెక్టర్ ని అడిగాడు అంటే నమ్ముతారా? నమ్మాలి. నమ్మితీరాల్సిన నిజం ఇది.
కార్తీ హీరోగా `జపాన్` అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. ఆ వేడుకలో సూర్య కూడా పాల్గొనడంతో డబుల్ కిక్ వచ్చింది. ఈ సినిమా దర్శకుడు రాజు మురుగన్. ఇతన్ని కార్తీ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని సినిమా ఛాన్సు అడిగి మరీ చేసిన సినిమా ఇది. అంత పెద్ద స్టార్ హీరో అతన్ని సినిమా అడగడం ఏంటి? ఆశ్చర్యానికి గురవ్వడంలో తప్పేం లేదు.
ఎందుకంటే రాజ్ మురుగన్ అగ్ర దర్శకుడేం కాదు. ఇప్పుడిప్పుడే దర్శకుడిగా ఎదుగుతున్నాడు. కానీ తన లో ప్రతిభ కార్తీని ఛాన్స్ అడిగేలా చేసింది. అవును రాజ్ మురుగన్ తొలి సినిమా `కూక్`. ఆ తర్వాత `జోకర్`..`జిప్సీ` లాంటి సినిమాలు చేసాడు. వాటి గురించి ఎవరి పెద్దగా తెలియదు. అలాగే వెబ్ సిరీస్ లకు ..కొన్ని సినిమాలకు స్టోరీ రైటర్ గా పనిచేసాడు. దాదాపు రెండళ్ల తర్వాత జపాన్ చిత్రాన్ని తీస్తున్నాడు.
అది కార్తీ అవకాశం ఇవ్వడంతో వచ్చిన అవకాశం లేకపోతే ఆయన ఇంకా ఖాళీగానే ఉండాల్సిన సన్నివేశం. కార్తీ అతని ప్రతిభని మెచ్చి అవకాశం ఇచ్చాడుట. రాజ్ మురుగన్ ఓ జర్నలిస్ట్ అని కార్తీ అన్నాడు. అతనితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడుట. ఈ క్రమంలో నే తనే తనని డైరెక్ట్ చేయమని అడిగారుట. ఇంతవరకూ అలా ఏదర్శకుడిని కార్తీ అడగలేదుట.
తొలిసారి నాతో సినిమా చేయండి..ఛాన్స్ ఇవ్వండి అని ఏకైక దర్శకుడు రాజ్ మురుగన్ అన్నారు. చివరికి మణిరత్నంతో మంచి పరిచయం ఉన్నా..ఏనాడు అతన్ని కూడా ఛాన్స్ అడగలేదని...రాజ్ మురగన్ ని మాత్రం పనిగట్టుకుని అడిగాను అంటున్నాడు. అతడు మంచి మేకర్ అని...గొప్ప స్టోరీలు రాస్తారని కార్తీ రాజ్ మురుగన్ ప్రతిభని ఆకాశానికి ఎత్తేసాడు.