ఆయన అడ్వాన్సుల కోసం అలా చేస్తున్నాడా?
స్టార్ హీరోయిన్లు ఫేంలో ఉన్నప్పుడు సినిమాలకు..బ్రాండింగ్స్ కి డేట్లు ఎలా కేటాయిస్తారో చెప్పాల్సిన పనిలేదు.
స్టార్ హీరోయిన్లు ఫేంలో ఉన్నప్పుడు సినిమాలకు..బ్రాండింగ్స్ కి డేట్లు ఎలా కేటాయిస్తారో చెప్పాల్సిన పనిలేదు. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నా! కొత్త అవకాశం వచ్చిందంటే విడిచిపెట్టరు. సినిమా అయినా..అది బ్రాండింగ్ అయినా దాని ద్వారా కోట్లు ఎలా లాగాలి! అని చూస్తారు. చివరికి ఐటం పాటల విషయంలోనూ హీరోయిన్ల మధ్య పోటీ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం.
ఏ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఐంట సాంగ్ ఆఫర్ వస్తే విడిచి పెట్టడం లేదు. కాదనకుండా నటిస్తున్నారు. కారణం పారితోషికంగా భారీగా ఉంటుందనే. ఫేం లో ఉన్నంత కాలమే ఇది సాధ్యం. ఆఫేం..క్రేజ్ తగ్గే కొద్ది పారితోషికం కూడా తగ్గిపోతుంది. అందుకే హీరోయిన్లు దీపం ఉండగానే మొత్తం చక్కబెట్టేస్తారు? అని ఓ నానుడి ఉంది. తాజాగా టాలీవుడ్ లో ఓ హీరో కమిట్ అవుతోన్న విధానం చూస్తే ఇలాగే అనిపిస్తుంది.
ఎప్పుడూ ఏడాదికి ఒక సినిమా చేసి రిలీజ్ చేయడమే..కానా కష్టంగా భావించే ఆ హీరో ఈ మధ్య పూర్తిగా మారిపోయాడు. హీరోయిన్ల తరహాలోనే కొత్త సినిమాల వేగం పెంచారు. ఒక సినిమా సెట్స్ లో ఉండగానే రెండు..మరో మూడు సినిమలకు సైన్ చేస్తున్నాడు. అంతేనా వాటిని ప్రారంభోత్సం కూడా చేసేస్తున్నారు. అవి రిలీజ్ ఎప్పుడు అవుతాయి? అన్నది సెకెండరీ. ముందు ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయిందా? లేదా? అన్న దానికే ప్రాధాన్యత.
అయితే ఎప్పుడు ఇలా చేయని ఆహీరో ఇప్పుడిలా చేయడం వెనుక మరో కథ ఉందని ప్రచారం సాగుతోంది. అడ్వాన్సుల కోసం...కొన్ని వ్యక్తిగత అవసరాల కోసం ఇలా వరుసగా సినిమాలకు కమిట్ అవ్వాల్సి వస్తోందని గుస గుస వినిపిస్తుంది. కేవలం ఆ కోణంలో సినిమాలు కమిట్ అవ్వడం తప్ప! వాటి ద్వారా అతనికి ఏదో వస్తుందనో..అభిమానుల ఉత్సాహ పడుతారానో? ఆశించి సంతకం చేయలేదని వినిపిస్తుంది.
కేవలం ఇప్పుడు డబ్బులు బాగా అవసరం ఉండటంతోనే ఇలా కొత్త ప్రాజెక్ట్ లు తెరపైకి తెస్తున్నట్లు వినిపిస్తుంది. ఇప్పటికే సెట్స్ లో ఉన్న సినిమాలు మూలుగుతున్నాయి. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో క్లారిటీ లేదు. ఈనేపథ్యంలో కొత్త సినిమా అంటే కొత్త కొత్త సందేహాలుతెరైకి వస్తున్నాయి.