ఓపెన్ అవ్వలేదు..కానీ లో-లోపల మండిపోతున్నారు!
అతనో స్టార్ హీరో. అతని సినిమా హిట్ అయితే నిర్మాతలకు కనక వర్షమే. దర్శకులు ఓవర్ నైట్ లోనే ఫేమస్ అయిపోతారు.
అతనో స్టార్ హీరో. అతని సినిమా హిట్ అయితే నిర్మాతలకు కనక వర్షమే. దర్శకులు ఓవర్ నైట్ లోనే ఫేమస్ అయిపోతారు. ఛాన్స్ ఇస్తే చాలు ఎంతకాలమైనా వెయిట్ చేయోచ్చు అన్నం డిమాండ్ ఉన్న హీరో అతను. కానీ అప్పుడప్పుడు ఇలా చేయడం కూడా తప్పే అవుతుందని తాజాగా ఆ నిర్మాతలకు అర్దమ వుతుంది. ఇక్కడ దర్శకుడు నష్టపోడు..హీరో నష్టపోడు? కానీ ప్రధానంగా నష్టపోయేది ఎవరు? అంటే నిర్మాత అని తెలుస్తోంది.
అవును ఇప్పుడా హీరోని ఓపెన్ గా ఏమీ అనలేకపోతున్నారుగానీ..లో-లోపల మండిపోతున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఆహీరో చేష్టలకు నిర్మాతలు కొత్త అప్పులు చేయాల్సి వస్తోందిట. ఆ హీరోపై ఇప్పటివరకూ పెట్టిన పెట్టుబడి మరో హీరోపై పెట్టినా సినిమా చేసి రిలీజ్ చేయోచ్చు. వస్తే నష్టం వస్తుంది. లేకపోతే లాభం వస్తుందని ఆలోచిస్తున్నారుట. అలా కాకుండా మీడియం హీరోతో అయితే ఏకంగా రెండు..మూడు సినిమాలైనా పూర్తి చేయచ్చు.
ఎంచక్కా వాటి కోసం స్వేచ్ఛగా పనిచేసాం అన్న తృప్తి అయినా మిగిలేదని రియలైజ్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. పైపెచ్చు ఆ హీరో కోసం ఇచ్చిన డబ్బంతా ఇతర మార్గాల ద్వారా అప్పులు చేసి తెచ్చిందిట. ఆ అప్పుకి వడ్డీలు చెల్లించడం భారంగా మారుతుందని అంటున్నారు. ఇలా వడ్డీ ఎంత కాలం చెల్లించాలో అర్దం కాని సన్నివేశం కనిపిస్తుందంటున్నారు. ఎందుకంటే ఆగిపోయిన ఆ సినిమాలు తిరిగి మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతాయో గ్యారెంటీ లేదుట. ఆ హీరో కూడా సరైన క్లారిటీ ఇవ్వడం లేదుట.
ఈ మధ్యనే ఈ విషయాన్ని ఆ ముగ్గురు నిర్మాతలు హీరో దృష్టికి తీసుకెళ్లారుట. కానీ ఆ హీరో మాత్రం ఇప్పుడు తాను ఉన్న పరిస్థితుల్లో తాను ఏం చేయలేనని..వెయిట్ చేయాల్సిందేనని ఖరాకండీగా చెప్పేసాడుట. మరి ఆ హీరోకి ఈ విషయం ముందుగా తెలియదా? అంటే తెలిసి ఆడిన డ్రామా అనే విమర్శ వినిపిస్తుంది. ఆ హీరో కేవలం డబ్బు అవసరం పడటంతోనే ఈ సినిమాలన్నీ ప్రారంభించాడు తప్ప! అంతకు మించి హీరోకి మరో ఆలోచన లేదని అంటున్నారు. ఆ సినిమాలకు గాను హీరో కేవలం అడ్వాన్స్ మాత్రమే తీసుకోలేదుట. డబ్బు అవసరం ఉండటంతో పుల్ పేమెంట్ ఒకేసారి తీసుకున్నాడని ఈ సందర్భంగా వెలుగులోకి వస్తోంది.