స్టార్ హీరోల వారసుల కలయిక, కానీ..!
అలాంటిది ఇద్దరు స్టార్ హీరోల వారసులు కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే కచ్చితంగా అది భారీ క్రేజ్ ను దక్కించుకోవడం ఖాయం. మల్టీ స్టారర్ సినిమాలకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇద్దరు హీరోల కలయిక సినిమాకు భారీగా బిజినెస్ కూడా జరుగుతుంది. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోల వారసులు కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
ఇప్పుడు అదే తమిళనాట జరుగబోతుంది. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ వారసుడు జాసన్ సంజయ్ మరియు మరో స్టార్ హీరో విక్రమ్ తనయుడు దృవ్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటీ అంటే వీరిద్దరు హీరోలుగా కలిసి నటించడం లేదు. జాసన్ సంజయ్ దర్శకత్వంలో దృవ్ విక్రమ్ హీరోగా నటించబోతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో జాసన్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్నట్లు కొన్ని నెలల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఇన్నాళ్లు స్క్రిప్ట్ వర్క్ చేసిన జాసన్ సంజయ్ ఇప్పుడు నటీ నటుల ఎంపిక పనుల్లో ఉన్నాడు. పలువురు హీరోలను పరిశీలించిన తర్వాత చివరకు కథ డిమాండ్ మేరకు దృవ్ విక్రమ్ అయితే బాగుంటాడు అనే అభిప్రాయానికి వచ్చారట. ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చిన దృవ్ ఒక బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ కలిసి నటించకున్నా కూడా.. కలిసి ఒక సినిమాను చేస్తే కచ్చితంగా అది తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా కచ్చితంగా మంచి బజ్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వారసుల ఇద్దరు తండ్రులు కూడా పాన్ ఇండియా స్టార్స్. కనుక వీరి మూవీకి పాన్ ఇండియా అప్పీల్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి లైకా వారు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.