స్త్రీ2 vs బాహుబలి 2.. ఆ రికార్డ్ కూడా బ్లాస్ట్ అయ్యింది

ఈ సినిమా మొదటి వారంలోనే హిందీలో కల్కి 2898ఏడీ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసింది.

Update: 2024-09-02 10:30 GMT

హిందీలో ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా నిలిచిన మూవీ స్త్రీ2. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు మెయిన్ లీడ్ గా తెరకెక్కిన ఈ హర్రర్ కామెడీ మూవీ ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మడ్ డోక్ ఫిలిమ్స్ బ్యానర్ హర్రర్ ఫ్రాంచైజ్ లో ఈ మూవీ స్త్రీకి సీక్వెల్ గా తెరకెక్కింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి మొదటి రోజు నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది.

ఈ సినిమా మొదటి వారంలోనే హిందీలో కల్కి 2898ఏడీ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. రెండో వారంలో కూడా సాలిడ్ వసూళ్లతో సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో కొనసాగింది. 11 రోజుల్లోనే 400 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని స్త్రీ2 టచ్ చేసింది. ఇక మూడో వారంలో స్త్రీ2 మూవీ హిందీలో 48.75 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. తద్వారా మూడు వారాల్లో 500 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో స్త్రీ2 మూవీ చేరిపోయింది.

గతంలో బాహుబలి 2 మూవీ మూడో వారంలో హిందీలో 42.55 కోట్ల కలెక్షన్స్ తో టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఈ కలెక్షన్స్ ని ఇప్పటి వరకు ఏ చిత్రం కూడా బ్రేక్ చేయలేకపోయింది. అయితే స్త్రీ2 మూవీ బాహుబలి 2 మూడో వారం కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసి టాప్ లోకి వచ్చింది. తద్వారా 7 సంవత్సరాలుగా నిలకడగా బాహుబలి 2 పేరు మీద ఉన్న రికార్డ్ ని స్త్రీ2 లాగేసుకుంది. నార్త్ ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ జాబితాలో ఉన్న జవాన్, గద్దర్2, పఠాన్, యానిమల్ సినిమాలని స్త్రీ2 మూవీ క్రాస్ చేసిందని తెలుస్తోంది.

అలాగే వరల్డ్ వైడ్ గా 714 కోట్ల కలెక్షన్స్ ని స్త్రీ2 మూవీ అందుకుంది. హిందీలో తెరకెక్కిన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రాల జాబితాలో 6వ స్థానంలోకి స్త్రీ2 మూవీ వచ్చింది. అలాగే 500 కోట్ల క్లబ్ లో చేరడంతో మరో అరుదైన ఫీట్ ని స్త్రీ2 మూవీ అందుకుంది. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎవ్వరి అంచనాలకి అందని విధంగా కలెక్షన్స్ వేట కొనసాగిస్తోంది.

నాలుగో వారంలో కూడా స్త్రీ2 మూవీకి అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే లాంగ్ రన్ లో స్త్రీ2 మూవీ 800+ కోట్ల కలెక్షన్స్ ని అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 1000 కోట్ల కలెక్షన్స్ ని సాధించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొంతమంది అంటున్నారు. అదే జరిగితే చిన్న సినిమాగా వచ్చి అతి పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రంగా స్త్రీ2 నిలిచే ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News