సుధీర్ బాబు కోసం నాన్న‌కు ప్రేమ‌తో ఇలా!

టీజ‌ర్ చూసి నేచుర‌ల్ స్టార్ నాని కూడా త‌న ఫీడ్ బ్యాక్ ఇచ్చాడు. నాని నేరుగా ఓ వాయిస్ మెసెజ్ పంపించి టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

Update: 2024-09-27 12:10 GMT

యంగ్ హీరో సుధీర్ బాబు స్టోరీ విష‌యంలో రూట్ మార్చిన సంగ‌తి తెలిసిందే. డిఫ‌రెంట్ కంటెంట్ తో ప్రేక్ష‌కుల్ని అల‌రించాల‌ని ట్రై చేస్తున్నాడు. కానీ తాను అనుకున్న రిజ‌ల్ట్ మాత్రం ఇంకా రావ‌డం లేద‌. ప్ర‌స్తుతం ఫాద‌ర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో `మా నాన్న సూప‌ర్ హీరో` అనే సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో సినిమాకి పాజిటివ్ బ‌జ్ తీసుకొచ్చింది. టీజ‌ర్ చూసి నేచుర‌ల్ స్టార్ నాని కూడా త‌న ఫీడ్ బ్యాక్ ఇచ్చాడు. నాని నేరుగా ఓ వాయిస్ మెసెజ్ పంపించి టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

తాజాగా ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కూడా మెచ్చుకున్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. సినిమా టీజ‌ర్ చూసి ఆయ‌న కూడా ప్ర‌శంస‌లు కురిపించాడుట‌. సుధీర్ బాబుతో సుకుమార్ చేసిన వాట్సాప్ చాట్ ని కూడా షేర్ చేసాడు. `ఎక్స్ ప్రెషన్స్ ఎంతో సెటిల్డ్‌గా ఉన్నాయి. ఇలాంటి పాత్రలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందంటూ సుకుమార్ మెసెజ్ చేశాడట. ఇంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు థాంక్స్ సర్. మీ వాట్సప్ డీపీలో మీ నాన్న గారి ఫోటో ఉంది.

అది చూస్తేనే మీకు మీ నాన్న అంటే? ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతోంది. ఈ సినిమా కూడా ఫాదర్ ఎమోషన్ గురించే` అని సుకుమార్ కి రిప్లై ఇచ్చాడు. మొత్తానికి రిలీజ్ కి ముందే సుకుమార్ ప్ర‌శంస కూడా సుధీర్ బాబు అందుకున్నాడు. సుకుమార్ కి నాన్న అంటే ఓ ఎమోష‌న్. ఆయ‌న ప్ర‌తీ సినిమాకి ఎండ్ కార్డులో నాన్నకు ప్రేమతో అని వేస్తాడు. ప్ర‌త్యేకంగా `నాన్న‌కు ప్రేమ‌తో` అనే సినిమా కూడా చేసిన సంగ‌తి తెలిసిందే.

తండ్రీ కొడుకుల బాండింగ్ ని అందులో ఎంతో అద్భుతంగా ఆవిష్క‌రించాడు. మ‌రి మా నాన్న సూప‌ర్ హీరోలో నాన్న‌- సుధీర్ బాబు మ‌ధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతిని అందిస్తారు? అన్న‌ది చూడాలి. ఇదే ఏడాది సుధీర్ బాబు `హ‌రోం హ‌ర` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News