సుహాస్ మూవీ వాయిదా.. మంచి పనే చేశారు!!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా నాన్ స్టాప్ గా చిత్రాలు చేస్తున్నారు. సినీ ప్రియులను ఓ రేంజ్ లో మెప్పిస్తున్నారు. ఇప్పుడు జనక అయితే గనక మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కంప్లీట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించారు.
ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోస్టర్లతోపాటు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ అయితే ఓ రేంజ్ లో అలరించింది. సరికొత్త కథనంతో మూవీ ఉండనుందని క్లారిటీ వచ్చేసింది. అయితే కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లో రిలీజ్ అవుతుందనగా.. మేకర్స్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
జనక అయితే గనక మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు బుధవారం ఉదయం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా రిలీజ్ పోస్ట్ పోన్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. "ఇప్పుడు వర్షాల మోత.. తర్వాత నవ్వుల మోతతో కలుద్దాం.. వరదల వల్ల పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తాం. నవ్వుల వినోదంతో త్వరలో కలుద్దాం" అని మేకర్స్ తెలిపారు.
అయితే మేకర్స్ కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నారని నెటిజన్లు చెబుతున్నారు. మూవీ టీమ్ ముందు చెప్పిన ప్రకారం, సెప్టెంబర్ 7వ తేదీ మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉంది. ముందు రోజు ప్రీమియర్స్ ప్లాన్ చేశారు మేకర్స్. అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. మరో నాలుగు రోజులు వానలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అందుకే రిలీజ్ పోస్ట్ పోన్ చేసి మంచి పని చేశారని కామెంట్లు పెడుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. సుహాస్ సరసన సంకీర్తన హీరోయిన్ గా నటిస్తోంది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ఓవర్సీస్ లో ఈ సినిమాను సుహాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.