సలార్ 2.. ఆ రూమర్ పై యువ హీరో క్లారిటీ
ఈ ఏడాదిలోనే షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఆగష్టు లోపు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం సలార్, ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా భారీ స్థాయిలో రాబట్టలేదు. కానీ సినిమాకి మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సలార్ 2 చేయడానికి ప్రశాంత్ నీల్ రంగం సిద్ధం చేస్తున్నాడు. శౌర్యంగ పర్వం టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనుంది.
ఈ ఏడాదిలోనే షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఆగష్టు లోపు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ హీరో సందీప్ కిషన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. సందీప్ కిషన్ మొదటి సినిమా ప్రస్థానంలో తన నెగిటివ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. హీరోగా టర్న్ అయిన తర్వాత విలనీ క్యారెక్టర్స్ జోలికి వెళ్ళలేదు.
అయితే సలార్ లో అలాంటి పాత్రలోనే కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం తెరపైకి వచ్చింది. దీనికి సందీప్ కిషన్ ఫుల్ స్టాప్ పెట్టాడు. ప్రస్తుతం ఆయన నటించిన ఊరు పేరు భైరవకోన రిలీజ్ కి రెడీ అయ్యింది. ఫిబ్రవరి 16న తెలుగు, తమిళ్ భాషలలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాపై సందీప్ కిషన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది.
సలార్ 2 చిత్రంలో తాను ఎలాంటి పాత్రలో కనిపించడం లేదని, అవన్నీ రూమర్స్ మాత్రమే అని కొట్టిపారేశాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా ఊరు పేరు భైరవకోన రిలీజ్ మీదనే ఉందని చెప్పాడు. కెరియర్ లో వరుస డిజాస్టర్ లతో సతమతం అవుతున్న సందీప్ కిషన్ కి ఈ మూవీ కాస్తా ఊపిరి పోసేలా కనిపిస్తోంది. సోలో రిలీజ్ డేట్ దొరకడం కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
ఈగల్ మూవీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే భైరవకోన రిలీజ్ నాటికి ఆ సినిమా స్పీడ్ దగ్గిపోవచ్చు. సినిమా ట్రైలర్ అయితే బజ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. మూవీకి ఎలాంటి టాక్ వస్తుందనేది సక్సెస్ రేంజ్ ని డిసైడ్ చేస్తుంది.