స్పెయిన్‌లో సునీల్.. మిడ్ నైట్ 2.30కి షాక్ ఇచ్చిన పాకిస్థానీ!
`పుష్ప` చిత్రంలో మంగళం శీను అనే ఏజ్డ్ స్మగ్లర్‌గా నటించాడు సునీల్. ఆ పాత్రకు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కిందని సునీల్ అన్నారు.
కొన్ని నెలల తర్వాత `పుష్ప 2` థాంక్స్ మీట్ లో బన్ని, సుకుమార్ స్పీచ్ లు కొన్ని అస్పష్టమైన విషయాలపై స్పష్ఠతనిచ్చాయి. ఈ ఫ్రాంఛైజీ నుంచి ఇంకా అన్ లిమిటెడ్ గా సినిమాలొస్తాయని సుకుమార్ స్వయంగా భరోసానిచ్చారు. పుష్ప 3 కొంత ఆలస్యంగా ప్రారంభమవుతుందని కూడా స్పష్ఠత వచ్చింది. దీంతో ఫ్యాన్స్ చాలా ఖుషీగా ఉన్నారు. ఇక ఇదే వేదికపై నటుడు సునీల్ స్పీచ్ ఆద్యంతం ఎమోషనల్ గా సాగింది.
`పుష్ప` చిత్రంలో మంగళం శీను అనే ఏజ్డ్ స్మగ్లర్‌గా నటించాడు సునీల్. ఆ పాత్రకు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కిందని సునీల్ అన్నారు. తనను స్పెయిన్ లో `పాకిస్తానీ కబాబ్ సెంటర్` వ్యక్తులు ఎలా గుర్తించారో కూడా ఈ వేదికపై సునీల్ వెల్లడించారు. ఒక స్థానిక ప్రొడక్ట్ లాంటి తనను ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ గా మార్చారంటూ సుకుమార్ టీమ్ ని కీర్తించారు సునీల్. దేవుడే దిగి వచ్చి ఇక ఆపండి అనేంతగా బన్ని హార్డ్ వర్క్ చేస్తారని కూడా సునీల్ కీర్తించారు. ప్రతిసారీ కష్టానికి ప్రతిఫలం కచ్ఛితంగా దక్కుతుందని కూడా అన్నారు.
స్పెయిన్ లో షూటింగ్ సమయంలో అర్థరాత్రి 2.30గం.లకు ఆకలితో ఫుడ్ కోసం వెతికిన అనుభవాన్ని సునీల్ గుర్తు చేసుకున్నారు. అక్కడ రాత్రి 10.30కే దుకాణాలు మూసేస్తారు. ఒక దుకాణం మూసేస్తుంటే అక్కడ చేతికి చిక్కినవి కొనుక్కుని, ఆ తర్వాత ఆకలి తీర్చేందుకు సరైన ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో వెతికాము. ఒక `కబాబ్ పాయింట్`ని చూసాం. ఇది భారతీయ రెస్టారెంట్ అని అనుకున్నాం. అక్కడ మావి రెండు వెహికల్స్ ఆగాయి. దర్శకత్వ శాఖ వెహికల్ తో పాటు నేను ఎక్కిన వెహికల్ ఆగింది. కబాబ్ సెంటర్ బయట ఇద్దరు బ్రదర్స్ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఆ సమయంలో నన్ను చూసిన వాళ్లు ఫోన్ లో ఒక వీడియో చూపించి `పుష్ప` నటుడు అని గుర్తు పట్టారు. అర్థరాత్రి 2.30 గం.టలకు మాకు ఏం కావాలో అవన్నీ వండి పెట్టారు. అది పాకిస్తానీల రెస్టారెంట్ అని కూడా తెలిసింది. వాళ్లు అర్థరాత్రి మాకోసం అన్ని వంటలు వండి పెట్టారు. నాకేమో హిందీ రాదు. వారితో హిందీ ఉర్దూను మ్యానేజ్ చేసాను... అని సునీల్ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
ఎక్కడకు వెళ్లినా పుష్ప నటుడిగా నాకు ఇంతటి గుర్తింపు దక్కింది. ఒక నటుడు బతికుండగా పునర్జన్మ ఇవ్వడం కష్టం. కమెడియన్ గా ఉన్న నాకు విలన్ గా అవకాశం ఇవ్వడం సాహసం. కానీ సుకుమార్ ఆ సాహసం చేసారని ప్రశంసించారు. మొదటి సారి నా ఏజ్ కంటే పెద్ద వాడి(మంగళం శీను)గా నటించాను.. అని సునీల్ అన్నారు. తమిళ్, మలయాళ, కన్నడంలో అందరూ గౌరవం ఇస్తున్నారు.. వరుసగా అవకాశాలిస్తున్నారని కూడా తెలిపారు. మీరు ఇచ్చిన నా పునర్జన్మ జెండాను ఇవాళ అందరూ మోస్తున్నారు అని సునీల్ ఎమోషనల్ అయ్యారు.