కల్కి : యాస్కిన్ - 2 ఇంట్రస్టింగ్ రూమర్స్‌!

తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం కల్కి 2 లో సుప్రీమ్‌ యాస్కిన్ పాత్ర పరిధి చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

Update: 2024-06-29 05:31 GMT

ప్రభాస్‌ కల్కి సినిమాలో అమితాబచ్చన్ మరియు కమల్‌ హాసన్ ల పాత్రల గురించి ప్రధాన చర్చ జరుగుతోంది. సినిమా కథ మొత్తం సుప్రీమ్‌ యాస్కిన్‌ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక అమితాబచ్చన్‌ హీరో స్థాయి పాత్రను పోషించారు అనడంలో సందేహం లేదు.

కల్కి సూపర్‌ హిట్ టాక్ ను సొంతం చేసుకుని భారీ వసూళ్లను నమోదు చేస్తున్న నేపథ్యంలో సీక్వెల్‌ పై అంచనాలు అప్పుడే భారీగా పెరిగాయి. సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో కల్కి 2 గురించిన పుకార్లు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం కల్కి 2 లో సుప్రీమ్‌ యాస్కిన్ పాత్ర పరిధి చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. యాస్కిన్‌ ను కల్కి 1 లో చిన్న పాత్రలోనే చూశాం. కానీ కల్కి 2 లో ఆయన స్క్రీన్‌ ప్రజెన్స్ చాలా ఎక్కువగా ఉండటంతో పాటు, కథ లో మరింత కీలక పాత్ర లో కనిపించబోతున్నాడట.

కల్కి 2 కోసం ఇప్పటికే యూనివర్శల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ డేట్లు ఇచ్చాడు అనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. భారతీయుడు 2 సినిమాతో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కమల్‌ హాసన్‌ ఇప్పటికే కమిట్ అయిన రెండు సినిమాలను పూర్తి చేసిన తర్వాత కల్కి 2 కి డేట్లు ఇవ్వనున్నాడని తెలుస్తోంది.

వచ్చే ఏడాదిలో కల్కి 2 సినిమా షూటింగ్‌ ను దర్శకుడు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు నాగ్‌ అశ్విన్ ఎప్పుడు అడిగితే అప్పుడు కల్కి 2 కి డేట్లు ఇచ్చేందుకు కమల్‌ తో పాటు ఇతర నటీనటులు కూడా రెడీ గా ఉన్నారనే సమాచారం అందుతోంది.

మొత్తానికి కల్కి 1 సినిమాతో పోల్చితే కల్కి 2 మరింతగా విజువల్ వండర్‌ లా ఉండే అవకాశం ఉందంటూ ఫ్యాన్స్ లో చర్చ మొదలయ్యింది. ఇప్పటి వరకు కల్కి 2 ఉంటుందని చెప్పారు తప్ప అధికారికంగా ఎలాంటి విషయాలు బయటకు రాలేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఇలాంటి పుకార్లు ఎన్నో వస్తూనే ఉన్నాయి.

Tags:    

Similar News