ఇన్నాళ్ళకు సూర్యతో ఆ స్టార్ హీరోయిన్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా మూవీ అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

Update: 2024-08-29 12:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా మూవీ అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. మూవీలో సూర్య ట్రైబల్ వారియర్ గా నటించారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. సూర్య44 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.


ప్రస్తుతం మూవీ షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సూర్యకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ లతో ఉన్న పూజా హెగ్డే ఈ చిత్రంపై చాలా హోప్స్ పెట్టుకుంది. కార్తిక్ సుబ్బరాజుకి కోలీవుడ్ లో సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంది. గత ఏడాది విడుదలైన జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీ కోలీవుడ్ లో హిట్ అయ్యింది. కానీ తెలుగులో అంతగా ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. అయితే సూర్య44 చిత్రాన్ని మాత్రం కార్తిక్ యూనివర్సల్ కాన్సెప్ట్ తోనే చేస్తున్నారంట.

ఈ సినిమా కోసం ఇతర భాషల నటీనటులని కూడా తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ ని ఐటెం సాంగ్ కోసం కార్తిక్ సుబ్బరాజు ఎంపిక చేసారంట. ప్రస్తుతం శ్రియా శరణ్ ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తోంది. ఫీమేల్ సెంట్రిక్ కథలలో కూడా అవకాశాలు రావడం లేదు. డిజిటల్ ఎంట్రీ ఇచ్చి షోటైం అనే హిందీ వెబ్ సిరీస్ లో శ్రియా నటించింది.

అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ ని ఈ బ్యూటీ అందుకుంది. శ్రియా శరణ్ గత కొంతకాలంగా గ్లామర్ ఫోటోషూట్ లతో ఇన్ స్టాగ్రామ్ లో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకి గ్లామర్ టచ్ తో ఉండే ఐటెం సాంగ్ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సూర్య44 మూవీ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఇందులో ఐటెం సాంగ్ క్లిక్ అయితే మరల అవకాశాలు పెరుగుతాయని భావిస్తోంది.

కోలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలతో శ్రియా శరణ్ హీరోయిన్ గా జతకట్టింది. అయితే సూర్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ మాత్రం ఇదే మొదటి సారి. అది కూడా సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించే అవకాశం శ్రియా శరణ్ అందుకుంది. మరి ఈ మూవీ ఆమెకి ఏ మేరకు బ్రేక్ ఇస్తుందనేది చూడాలి.

Tags:    

Similar News