సూర్య సమోసా, సాంబర్ రైస్ కి ప్యాన్!
కోలీవుడ్ స్టార్ సూర్య-జ్యోతిక దంపతులు ఇటీవల చెన్నై నుంచి కాపురాన్ని ముంబైకి షిప్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ సూర్య-జ్యోతిక దంపతులు ఇటీవల చెన్నై నుంచి కాపురాన్ని ముంబైకి షిప్ట్ చేసిన సంగతి తెలిసిందే. జ్యోతికి ఇప్పటివరకూ సూర్య కోసం ఎన్నో త్యాగాలు చేసిందని..తనకోసం ఇప్పటికైనా ముంబై కి మారాలని సూర్య నిర్ణయించుకుని ముంబై కి షిప్ట్ అయ్యారు. అలాగే పిల్లల చదువులు కూడా ముంబైలో అయితే బాగుం టుందని ఇలా ప్లాన్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక ముంబైకి షిప్ట్ అయిన తర్వాత జ్యోతిక ఎంతో ఓపెన్ గా ఉంటుంది.
అంతకు ముందు సోషల్ మీడియాలో చాలా పరిమితంగానే కనిపించేది. కానీ ఇప్పుడు బాలీవుడ్ కల్చర్ లో మమేకం అయినట్లు కనిపిస్తుంది. తాను చేస్తోన్న వర్కౌట్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. చెన్నైలో ఉన్నంత కాలం ఇలాంటి వాటికి దూరంగా ఉన్నా? ముంబైకి వచ్చిన తర్వాత మాత్రం ఎంతో ప్రీగా కనిపిస్తుంది. మీడియా కంట తరుచూ పుతుంది. అలాగే సినిమాలు కూడా చేస్తుంది. ఇక ముంబైలో ఫేమస్ అంటే అంతా చెప్పేది ఒక్కటే మాట.
అదే పావు బాజీ. అతి చవకైనది..అందరూ ఇష్టపడి తినే ఐటం కూడా ఇదే. తాజాగా ముంబైలో ఓ రెస్టారెంట్ లో పావు బాజీ తింటోన్న సూర్యని చూసి! ఓ లేడీ ఇంటర్వ్యూయర్ మీకు పావు బాజీ ఇష్టమా? సమోసా ఇష్టమా? అని అడిగింది. దానికి సూర్య సమోసా అని సమాధానం ఇచ్చాడు. ముంబై సమోసా చాలా టేస్టీగా ఉంటుందన్నాడు. ఎక్కువగా ఇంటి పుడ్ నే తింటానన్నాడు.
ఇంట్లో చేసే దోశ అంటే ఇష్టం . రసం..సాంబార్ లో ఏది ఇష్టం అంటే? సాంబార్ అన్నం. రొమాంటిక్ చిత్రాలు ఇష్టమా? యాక్షన్ చిత్రాలు ఇష్టమా? అంటే యాక్షన్ యాక్షన్ అంటూ నవ్వేసాడు. లేట్ ఫర్ రొమాన్స్ అనేసాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారాయింది.