ముగ్గురు ప‌వ‌ర్ ఫుల్ బాస్ లే.. మ‌రి కెపాసిటీ ఎంతో?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ యాక్ష‌న్ ఎలివేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2024-09-26 06:19 GMT

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ యాక్ష‌న్ ఎలివేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 70 ఏళ్ల వ‌య‌సులోనూ అదే దూకుడు. ఇటీవ‌ల రిలీజ్ అయిన `జైల‌ర్` తో మ‌రోసారి పాత్ర ప‌రంగా ఏ రేంజ్లో హైలైట్ అయ్యారో తెలిసిందే. జైల‌ర్ పాత్ర‌కు ప్రేక్ష‌కులు అంతా ఫిదా అయ్యారు. వ‌య‌సు మ‌ళ్లినా? అత‌డిలో ఫ‌వ‌ర్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని పించారు. వ‌య‌సు కేవ‌లం నెంబ‌ర్ మాత్ర‌మే అని...నా మ‌న‌సుకు కాదంటూ? ఊచ కోత కోసారు.

అంత‌కు ముందు అంత‌కు మించిన ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ల‌తో మెప్పించిన సంద‌ర్భాలెన్నో. బాస్ ఎక్క‌డున్నా? బాసే అన్న‌ట్లు 70 ప్ల‌స్ లోనూ అదే దూకుడు కొన‌సాగిస్తున్నారు. త్వ‌ర‌లో `వెట్టేయాన్` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నారు. ఇందులో బాస్ ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. `జైల‌ర్` ని మించిన ప‌వ‌ర్ ఫుల్ పాత్ర ఇది.

ఏకంగా ర‌జ‌నీ లాంటి ఇమేజ్ ఉన్న హీరోకి ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ఇస్తే బుల్లెట్ల వ‌ర్షం ఎలా కురుస్తుందో? అంచ‌నా వేయ‌డం కూడా క‌ష్ట‌మే. ఇదే త‌ర‌హాలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా దూసుకొస్తున్నాడు. ఆయ‌న హీరోగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఓజీ` తెర‌కెక్కుతోన్న‌ సంగ‌తి తెలిసిందే. ఇందులో పీకే గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర పోషిస్తున్నాడు. ముంబై మాఫియా లో అత‌డో డాన్. మాఫియా కి న్యూ మీనింగ్ ఇచ్చేలా? పీకే డాన్ పాత్ర ఉంటుంద‌ని అంచ‌నాలున్నాయి.

మ‌రి ఆ పాత్ర‌ని సుజిత్ ఎలా హైలైట్ చేస్తాడు? అన్న‌ది చూడాలి. గ‌తంలో` బాలు`, `పంజా` సినిమాల్లో కూడా గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లు పోషించిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి పాత్ర‌ల్లో పీకే ఒదిగిపోతాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. మ‌రి `ఓజీ` లో ఎంత కొత్త‌గా చూపిస్తారు? అన్న‌ది చూడాలి. అలాగే కోలీవుడ్ స్టార్ సూర్య గ్యాంగ‌స్ట‌ర్ రోల్ కి పెట్టింది పేరు అని `విక్ర‌మ్` తో చాటిన సంగ‌తి తెలిసిందే.

అందులో రోలెక్స్ పాత్ర‌తో ఇండియానే షేక్ చేసాడు. అలాంటి సూర్య , కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంలో గ్యాంగ్ స్ట‌ర్ రోల్ పోషిస్తున్నాడు. సుబ్బ‌రాజ్ సినిమా అంటే కామిక్ సెన్స్ హైలైట్ అవుతుంది. మ‌రి సూర్య‌ని గ్యాంగ్ స్ట‌ర్ గా చూపిస్తోన్న నేప‌థ్యంలో త‌న మార్క్ ఎంట‌ర్ టైన‌ర్ గా మ‌లుస్తాడా? కొత్త‌గా చూపిస్తాడా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News