కంగువ… టాలీవుడ్ లో రేటెంత?

ప్రస్తుతం అయితే 20 కోట్లు తెలుగు రైట్స్ కోసం ఇవ్వడానికి ప్రముఖ డిస్టిబ్యూటర్ ముందుకొచ్చారని టాక్. అయితే ఇంకా ఎక్కువ వస్తాయని మేకర్స్ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-07-07 11:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి నటుడిగా ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. విలక్షణ నటుడిగా కమల్ హాసన్, విక్రమ్ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపుని సంపాదించాడు. ఓ వైపు యాక్షన్ కమర్షియల్ సినిమాలు చేస్తూనే కంటెంట్ బేస్డ్ కథలకి కూడా సూర్య పెద్దపీట వేస్తూ ఉంటాడు. అందుకే జై భీమ్, ఆకాశం నీ హద్దురా లాంటి సినిమాలు సూర్య నుంచి చూడగలిగాం. ఆ మూవీస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే.

ఈ రెండు సినిమాలకి ముందు సూర్యకి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు పడలేదు. దీంతో టాప్ లో ఉన్న అతని మార్కెట్ దారుణంగా పడిపోతూ వచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో సూర్య సినిమాలకి మార్కెట్ ఉంది. అయితే వరుస ఫెయిల్యూర్స్ కారంగా అతని ఇమేజ్ తగ్గిపోయింది. ఆకాశం నీ హద్దురా మూవీ సక్సెస్ అయిన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యింది.

జైభీమ్ మూవీ సూర్యకి వచ్చిన చివరి సక్సెస్. తరువాత ఈటీ అనే మూవీ చేశాడు. ఇది డిజాస్టర్ అయ్యింది. విక్రమ్ లో రోలెక్స్ క్యారెక్టర్ లో పవర్ ఫుల్ విలన్ గా సూర్య కనిపించాడు. రెండేళ్ల క్రితం విక్రమ్ మూవీ వచ్చింది. ఆ తరువాత శివ దర్శకత్వంలో కంగువ మూవీని సూర్య ఒప్పుకున్నాడు. సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది. పాన్ వరల్డ్ రేంజ్ లో మూవీ థియేటర్స్ లోకి వస్తోంది.

పోస్టర్స్, టీజర్ తో కంగువ మూవీ ఒక్కసారిగా ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. ఇందులో ఆటవిక వీరుడిగా సూర్య విచిత్రమైన గెటప్ లో కనిపిస్తున్నాడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రైట్స్ కోసం భారీ పోటీ నెలకొని ఉందంట. చాలా కాలం తర్వాత తెలుగు డిస్టిబ్యూటర్స్ కంగువ మూవీ రిలీజ్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారంట.

ప్రస్తుతం అయితే 20 కోట్లు తెలుగు రైట్స్ కోసం ఇవ్వడానికి ప్రముఖ డిస్టిబ్యూటర్ ముందుకొచ్చారని టాక్. అయితే ఇంకా ఎక్కువ వస్తాయని మేకర్స్ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య ఇమేజ్ పరంగా చూసుకుంటే 20 కోట్లు పెద్ద మొత్తమని చెప్పొచ్చు. అయితే కంగువ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది కావడం, అలాగే హైవోల్టేజ్ కాన్సెప్ట్ వలన మేకర్స్ ఇంకా ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ కి ఇంకా సమయం ఉంది కాబట్టి థీయాట్రికల్ రైట్స్ కి సంబందించిన బిజినెస్ చర్చలు కొనసాగే అవకాశం ఉంది. మరి ఫైనల్ గా ఎంతకి డీల్ క్లోజ్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News