సూర్య కంగువ.. అసలు స్టోరీ ఇదేనా?

సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ కంగువ. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే

Update: 2024-03-21 04:41 GMT

సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ కంగువ. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. కంప్లీట్ గూస్ బాంబ్ సీక్వెన్స్ తో టీజర్ ని సిద్ధం చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో సూర్య ట్రైబల్ వారియర్ గా కనిపిస్తున్నాడు. ప్రతినాయకుడిగా బాబీ డియోల్ మరో డిఫరెంట్ క్యారెక్టర్ ని ఈ సినిమాలో పోషిస్తున్నాడు.

కంప్లీట్ పీరియడ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ట్రైబల్ వార్ సీక్వెన్స్ తో ఈ మూవీని శివ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే రెండు భాగాలుగా తెరకెక్కబోయే ఈ కాన్సెప్ట్ లో టైం ట్రావెల్ పాయింట్ ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా అసలు స్టోరీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ప్రచారం నడుస్తోంది. 1678లో అత్యంత క్రూరమైన ట్రైబల్ వారియర్ గా ఉండే సూర్య ఒక మిషన్ కోసం లేడీ శాస్త్రవేత్త సహాయంతో ప్రెజెంట్ లోకి వస్తాడంట. గతం నుంచి వర్తమానంలోకి వచ్చిన సూర్య ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. మిషన్ ని ఎలా కంప్లీట్ చేసాడు అనేది మూవీ కథాంశంగా ఉంటుందని టాక్.

కళ్యాణ్ రామ్ బింబిసారా కథ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. చరిత్రలో అత్యంత క్రూరమైన రాజుగా ఉన్న బింబిసారా వర్తమానంలోకి వచ్చి ఎలా పరివర్తన చెందాడు. ఇక్కడి విలన్స్ ని ఎలా నాశనం చేసి ప్రాణత్యాగం చేసాడు అనేది ఉంటుంది. మూవీ సూపర్ హిట్ అయ్యింది. కంగువాలో కూడా సూర్య గతం నుంచి వర్తమానంలోకి రావడం అనే పాయింట్ హైలైట్ గా ఉంటుందంట.

మరి సోషల్ మీడియాలో ప్రచారం అవుతోన్న ఈ కథ ఎంత వరకు కరెక్ట్ అనేది తెలియదు కానీ సూర్య అభిమానులకి మాత్రం కంగువా స్టోరీ లైన్ ఆసక్తి కలిగిస్తోంది. నాగరిక ప్రపంచం అంటే తెలియని ఒక ఆదిమ జాతి మహావీరుడు ఆధునిక యుగంలోకి వచ్చి మిషన్ ఎలా కంప్లీట్ చేసాడు అనేది తెలియాలంటే కంగువా మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

అయితే మరోవైపు డైరెక్టర్ శివ మేకింగ్ పై ఓ వర్గం ఫ్యాన్స్ అంత నమ్మకంతో లేరు. ఎందుకంటే అతని కమర్షియల్ ట్రాక్ రికార్డ్ అలాంటిది అనే టాక్ వస్తోంది. తెలుగులో శివ శౌర్యం, శంఖం, దరువు సినిమాలు చేశాడు. ఇక తమిళంలో అజిత్ తో వీరం, వెదళం, వివేగం, విశ్వాసం అంటూ వరుస సినిమాలు చేశాడు. అందులో అజిత్ ఎలివేషన్స్ తప్ప కంటెంట్ ఉండదు అనే కామెంట్స్ వస్తుంటాయి. ఇక చివరగా రజినీకాంత్ తో చేసిన అన్నత్తై మరీ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. మరి ఇప్పుడు కంగువా సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News