ఆ స్టార్ హీరో డ్రీమ్ మ‌ళ్లీ ప‌ట్టాలెక్కుతుందా?

కోలీవుడ్ స్టార్ సూర్య‌- వెట్రీమార‌న్ కాంబినేష‌న్ లో అప్ప‌ట్లో జ‌ల్లిక‌ట్టు నేప‌థ్యంలో `వాడివాస‌ల్` అనే సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-06-28 00:30 GMT

కోలీవుడ్ స్టార్ సూర్య‌- వెట్రీమార‌న్ కాంబినేష‌న్ లో అప్ప‌ట్లో జ‌ల్లిక‌ట్టు నేప‌థ్యంలో `వాడివాస‌ల్` అనే సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లు పెట్టారు. కొంత పార్ట్ షూటింగ్ జ‌రిపారు. సూర్య ఈ చిత్రాన్ని త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ గా కూడా ప్ర‌క‌టించారు. అయితే ఇంత‌లో ఆ ప్రాజెక్ట్ ని అర్దంత‌రంగా ఆపేసారు. అందుకుగల కార‌ణాలు ఏంటి? అన్న‌ది చెప్ప‌కుండానే ప్రాజెక్ట్ ని ఆపేసారు.

అయితే అప్ప‌టికే త‌మిళనాట జ‌ల్లుక‌ట్టు వ్య‌తిరేకంగా ఉద్య‌మం కూడా న‌డుస్తోంది. దీంతో సినిమా వివాదాస్ప‌ద‌మ‌వుతుంద‌ని? ఆపేసారా? అని అప్ప‌ట్లో చ‌ర్చ సాగింది. కానీ దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఆ త‌ర్వాత వాడివాస‌ల్ గురించి ఎక్క‌డా చ‌ర్చ కూడా సాగ‌లేదు. సూర్య వేర్వేరు సినిమాలు చేసాడు కానీ ఆ చిత్రం గురించి మాత్రం ఎక్క‌డా స్పందించ‌లేదు. తాజాగా చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఆ సినిమాని ప‌ట్టాలెక్కించే ప్ర‌య‌త్నాలు మొద‌లైన‌ట్లు తెలుస్తోంది.

ఇదే ఏడాది తిరిగి ప్రారంభించాల‌ని సూర్య సంక‌ల్పించిన‌ట్లు కోలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. ఇప్ప‌టికే వెట్రిమార‌న్ తో కూడా చర్చ‌లు పూర్త‌య్యాయని, య‌ధా విధిగా ఎలాంటి మార్పులు లేకుండా షూటింగ్ చేద్దామ‌ని ఇరువురు డిస్క‌స్ చేసుకున్న‌ట్లు వినిపిస్తుంది. ఈ సినిమా కోసం సూర్య జ‌ల్లిక‌ట్టు లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. ఎద్దుతో క‌లిసి దిగిన ఫోటోలు కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు.

మ‌ళ్లీ ఇప్పుడా ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఇందులో ఆండ్రియో జ‌ర్మేనియా హీరోయిన్ గా ఎంపికైంది. క‌లైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా నిర్మాణ వ‌ర్గాల నుంచి క్లారిటీ వ‌స్తే గానీ ఇందులో నిజ‌మెంత‌? అన్న‌ది తెలియ‌దు. ప్ర‌స్తుతం సూర్య త‌న 44వ సినిమాని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News