'రోలెక్స్' ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..స్టోరీ లాక్!

లోకేశ్ క‌న‌గరాజ్ సినిమాటిక్ యూనివ‌ర్శ్ లో! `రోలెక్స్` రోల్ లో సూర్య‌ని క్లైమాక్స్ లో ఏ రేంజ్ లో హైలైట్ చేసారో చూసాం.

Update: 2023-08-13 14:35 GMT

లోకేశ్ క‌న‌గరాజ్ సినిమాటిక్ యూనివ‌ర్శ్ లో! `రోలెక్స్` రోల్ లో సూర్య‌ని క్లైమాక్స్ లో ఏ రేంజ్ లో హైలైట్ చేసారో చూసాం. మొత్తం డ్ర‌గ్స్ మాఫియాని ఏలే కింగ్ పాత్ర‌లో రోలెక్స్ ని ఆద్యంతం హైలైట్ చేసారు. ఓవైపు డ్ర‌గ్ ముఠాని అంతం చేసే ప‌నిలో విక్ర‌మ్ ప‌డితే! మాఫియా ప‌త‌నానికి కార‌కుడైనా వాడిని అంతం చేయాల‌ని మ‌రోవైపు రోలెక్స్ ప్ర‌తీకారంతో ర‌గిలిపోయే స‌న్నివేశం. ఈ రెండు పాత్ర‌ల మ‌ధ్య క‌థ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. నెగిటివ్ రోల్ అయినా సూర్య న‌టించ‌డంతో ఆ పాత్ర‌కే వ‌న్నే వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో రోలెక్స్ పాత్ర‌ని మాత్ర‌మే హైలైట్ చేస్తూ ఓ సినిమా చేయాల‌ని సూర్య అభిమానులు బ‌లంగా కోరుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో సూర్య‌-క‌న‌గ‌రాజ్ లు అభిమానుల కోరిక మేర‌కు ఆ ర‌కంగా ముందు కెళ్తారా? లేదా? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. తాజాగా ఈ విష‌యాన్ని క‌న్ప‌మ్ చేస్తూ సూర్య అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. రెలెక్స్ పాత్ర‌తోనే సినిమా చేస్తున్న‌ట్లు ఫ్యాన్స్ మీట్ లో వెల్ల‌డించారు.

`లోకేష్ రోలెక్స్ పై ఓ క‌థ చెప్పారు. అది నాకెంతో న‌చ్చింది. అది కూడా త్వ‌ర‌లోనే మొద‌ల‌వుతుంది. రోలెక్స్ పూర్త‌య్యాక `ఇవ‌రుభుకై మాయ‌వి` సినిమా చేస్తామ‌ని తెలిపారు. దీంతో అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అభిమానుల కోరిక మ‌న్నించి సూర్య -క‌న‌గరాజ్ ఆ పాత్ర చుట్టూనే ఓ సినిమా చేయ‌డం స‌ర్ ప్రైజింగ్. ఇది అభిమానులు ఊహించ‌నిది. అభిమానులు ఎన్నో కోరుతుంటారు.

కానీ ద‌ర్శ‌క‌-హీరోల‌కు అన్నింటిని సాధ్యం చేయ‌డం కుద‌ర‌దు. కానీ రోలెక్స్ పాత్ర‌ని మాత్రం సూర్య అండ్ కో ఎంత సీరియ‌స్ గా తీసుకుందో తాజా స‌న్నివేశం చెప్ప‌క‌నే చెబుతుంది. ప్ర‌స్తుతం సూర్య `కంగువా` సినిమాలో న‌టిస్తున్నారు. ఇది రిలీజ్ అయిన అనంత‌రం సూర్య 43వ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది. అటుపై `రోలెక్స్` ప‌ట్టాలెక్క‌నుంది.

Tags:    

Similar News