మెగాసిస్టర్స్ మధ్య పోటీ తప్పదా?
మెగా సిస్టర్స్ సుస్మిత కొణిదెల...నిహారిక కొణిదెల నిర్మాతలగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
మెగా సిస్టర్స్ సుస్మిత కొణిదెల...నిహారిక కొణిదెల నిర్మాతలగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై నిహారిక.. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై సుస్మిత సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన `కమిటీ కుర్రాళ్ల`తో నిహారిక తొలి సక్సెస్ అందుకుంది. అలాగే సుస్మిత మాత్రం ఇంకా సినిమా నిర్మించలేదు. తొలి సినిమా ఏకంగా డాడ్ మెగాస్టార్ చిరంజీవితోనే నిర్మించి సత్తా చాటాలని చూస్తుంది. స్టోరీ దర్శకుడు కుదరక వెయిట్ చేస్తోంది.
లేదంటే ప్రాజెక్ట్ ఎప్పుడో పట్టాలెక్కించేది. రెండవ సినిమా కూడా ప్రకటించేది. అయితే అక్కా-చెల్లి ఇద్దరు వెబ్ కంటెంట్ తోనే నిర్మాతలగా ఎంట్రీ ఇచ్చి సినిమా నిర్మాతలుగా ప్రమోట్ అయ్యారు. కానీ ఇద్దరు ఇంకా మెగా హీరోలతో మాత్రం సినిమాలు ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తానని నిహారిక కాన్పిడెం ట్ గా ఉంది. బాబాయ్ ని డిమాండ్ చేసే స్టోరీ ఇస్తే నిర్మాతగా తానేంటో చూపిస్తానంటోంది.
అటు సుస్మిత డాడ్ కోసం పట్టుబట్టి వెయిట్ చేస్తోంది. మరి వీళ్లిద్దరి మధ్య ఎప్పటికైనా నిర్మాతలుగా క్లాష్ వచ్చే అవకాశం ఉందా? అంటే ఎందుకు ఉండదు. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయిధర్మ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా ఇంత మంది హీరోలున్నారు. కోట్ల రూపాయల బిజినెస్ చేసే హీరోలు మెగా ఫ్యామిలీలోనే ఉన్నారు. వీళ్ల కోసం బయన నిర్మాతలు పోటీ పడుతుంటారు.
తేజ్ లిద్దర్నీ మనిహాయిస్తే మిగతా వారి డేట్టు దొరకడమే మహా భాగ్యంగా ఫీలవుతారు. ఇప్పటికే చిరు, చరణ్, పవన్ కోసం పోటీ పడే నిర్మాతలెంతో మంది ఉన్నారు. కొంత మంది క్యూలో ఉన్నారు. ఆ రకంగా చూస్తే వాళ్లతో పోటీగా మెగా సిస్టర్స్ ఇద్దరు ఉన్నట్లే. అదే పోటీ పీక్స్ కి చేరిందంటే? అక్కా-చెల్లి మధ్య నువ్వా? నేనా? అన్న తగ్గాఫ్ వార్ తప్పదు.