మాజీ ప్రియుడితో సుష్ అనుబంధం
మాజీ మిస్ యూనివర్స్, సీనియర్ నటి సుస్మితాసేన్ ప్రేమాయణాలు అన్నివేళలా హాట్ టాపిక్.
మాజీ మిస్ యూనివర్స్, సీనియర్ నటి సుస్మితాసేన్ ప్రేమాయణాలు అన్నివేళలా హాట్ టాపిక్. ఇంతకుముందు మోడల్ రోహ్మన్ షాల్ తో ప్రేమాయణం సాగించిన సుస్మితా సేన్ అతడికి బ్రేకప్ చెప్పి, ఆ తర్వాత ఐపీఎల్ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఏజ్డ్ మ్యాన్ లలిత్ మోడీతో డేటింగ్ ని ప్రారంభించడం చర్చకు తెరలేపింది. కానీ ఇంతలోనే అతడి నుంచి విడిపోయి, తిరిగి మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్ తో కలిసిపోయిందని కథనాలొచ్చాయి.
తాజాగా మరోసారి దీనిని కన్ఫామ్ చేస్తూ సుష్ అతడికి శుభాకాంక్షలు చెప్పింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రోహ్‌మాన్ షాల్ తో కలిసి ఉన్నప్పటి ఫోటోను షేర్ చేసింది ఈ భామ. ఇద్దరూ తమ శీతాకాలపు స్వెట్ దుస్తులలో కనిపించారు. ఈ స్నాప్‌షాట్ వెబ్ లో ప్రకంపనలు సృష్టించింది. వీరిద్దరి మధ్య ఆనందకరమైన జీవితానికి ఈ ఫోటో సింబాలిక్ గా నిలిచింది. సంతోషకరమైన పోటోతో పాటు, సుస్మితా సేన్ తన నిజమైన ఆప్యాయతను తెలియజేసింది.
''పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు @రోహ్మాన్ షాల్. మీ ఆనందానికి ఎల్లప్పుడూ టోస్ట్! ప్రేమ & దువాస్ సమృద్ధి! అని సుస్మిత రాసారు. రోహ్మాన్ స్పెషల్ డే సెలబ్రేషన్ తో పాటు, వారి మధ్య పరిణతి చెందిన స్నేహం, ప్రేమ, ఆప్యాయత అనుబంధాన్ని ఇది ప్రతిబింబించింది. అభిమానులు అనుచరులు వ్యాఖ్యల విభాగాన్ని హార్ట్ ఎమోజీలతో నింపారు. రోహ్మాన్ షాల్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సుష్ మంచి మనసును చాలా మంది కీర్తించారు.
సుస్మితా సేన్ - రోహ్‌మాన్ షాల్ ఇప్పుడు మాజీలేనా? అంటే అవును అనే చెప్పాలి. ఈ జంట ఒకరికొకరు ఆప్యాయత మద్దతు పరంగా ఒకటిగా ఉన్నా కానీ, కలిసి లేరు. ఎవరికి వారు విడివిడిగా ఉన్నారు. తమ మధ్య ఉన్న బంధం దృఢంగా ఉందని, పరస్పర గౌరవంతో నిండి ఉందని వారి ఇటీవలి పరస్పర చర్య వెల్లడిస్తోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సుస్మితా సేన్ తాజా విడుదలైన `ఆర్య సీజన్ 3`లో అద్భుత నటనతో అలరించింది. ఇది నవంబర్ 3న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రారంభమైంది. సుస్మిత తాలీలో కూడా కనిపించింది. రవి జాదవ్ దీనికి దర్శకత్వం వహించారు. కృతికా డియో, అంకుర్ భాటియా, ఐశ్వర్య నార్కర్, సువ్రత్ జోషి, హేమాంగి కవి, మీనాక్షి చుగ్ మరియు మాయా రాచెల్ మెక్‌మనుస్‌లతో తదితరులు నటించారు. లింగమార్పిడి కార్యకర్త శ్రీగౌరి సావంత్ స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణానికి సంబంధించిన కథతో రూపొందింది తాలి. బయోగ్రాఫికల్ డ్రామా ఆగస్ట్ 15న JioCinemaలో ప్రారంభమైంది.