'స్వయంభు' పెద్ద ప్లానే.. ఒక్క సీన్ కోసమే రూ.8 కోట్లు
ఈ చిత్రంలో నిఖిల్ ఓ లెజెండరీ యోధుడిగా కనిపించనున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ప్రస్తుతం స్వయంభు మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నిఖిల్ ఓ లెజెండరీ యోధుడిగా కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అందులో ఓ సీన్ కోసం వరల్డ్ బెస్ట్ టెక్నీషియన్స్ ను రప్పించినట్లుగా హీరో నిఖిల్ స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. పోస్టర్ కూడా షేర్ చేశారు.
అయితే ఈ యాక్షన్ సీన్ ను 12 రోజుల పాటు దాదాపు 700 మందితో తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ ఒక్క సీన్ కోసం మేకర్స్ రూ.8 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. ఈ సీన్ సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోనుందట. ఒక్క సీన్ కోసం రూ.8 కోట్లు పెట్టి షూట్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదని నెటిజన్లు చెబుతున్నారు. అలా చూసుకుంటే సినిమా మొత్తం బడ్జెట్ ఎంతోనని ఊహించుకుని ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఈ సినిమా నిఖిల్ కెరీర్ లో మరో పాన్ ఇండియా హిట్ గా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. నిఖిల్ కూడా ఈ మూవీ కోసం బాగా కష్టపడుతున్నారు. కత్తిసాము, గుర్రపు స్వారీ, కర్ర సాము వంటి పలు విద్యలు నేర్చుకున్నారు. ఒకప్పుడు రూ.8 కోట్ల బడ్జెట్(దాదాపు) లో సినిమాలు చేసిన నిఖిల్.. ఇప్పుడు ఆయన నటిస్తున్న మూవీలో ఒక్క యాక్షన్ సీన్ కు మేకర్స్ రూ.8 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే గ్రేటే!
ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియో బ్యానర్ పై భువన్, శంకర్ సంయుక్తంగా స్వయంభు మూవీని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు మ్యూజిక్ అందించిన.. రవి బస్రూర్ బాణీలు కడుతున్నారు. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.