సారీ-కోట్ రొమాన్స్ ..ప్రియుణ్ణి ఊహించుకునా!
తాప్సీ- మథియాస్ బో రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న ప్రచారం నెట్టింట ఠారెత్తిపోతున్న సంగతి తెలిసిందే
తాప్సీ- మథియాస్ బో రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న ప్రచారం నెట్టింట ఠారెత్తిపోతున్న సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ లో సైలెంట్ గా కార్యక్రమం కానిచ్చేసారని ఒక్కసారిగా వార్త రావడంతో అది నెట్టింట వైరల్ గా మారింది. దానిపై ఇంతవరకూ ఎలాంటి క్లారిటీ లేదు. పెళ్లి చేసుకున్నారా? లేదా? అన్న దానిపై ఈ జోడీ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో నెట్టింట ప్రచారం అంతకంతకు పెరుగుతూనే ఉంది. తాజాగా తాప్సీ మథియస్ తో ఉన్న ఫోటోల్ని షేర్ చేసింది.
ఈ చీరతో రొమాన్స్ ఎప్పటికి ముగియదని నమ్ముతున్నా` అని ఇంట్రెస్టింగ్ కామెంట్ పోస్ట్ చేసింది. దీంతో ఈ పెళ్లి ప్రచారమంతా నిజమేనా? అన్న బలమైన సంకేతాలు తాప్సీ పంపినట్లు అయింది. ఇద్దరు కలిసి ఉన్న ఓ ఫోటోలో చీరతో మరో ఫోటోలో అదే చీరపై నల్లటి కోట్ ధరించి ఉంది. దీంతో ఇద్దరు ఒక్కటే అనే హింట్ తాప్సీ పంపినట్లు అయింది. ప్రియుడి కోట్ ని చీరపై ధరించి ఇద్దరు ఒక్కటే అన్నట్లు అసలు సంగతి ఇలా చెప్పేసింది అంటున్నారు.
ఏది ఏమైనా పెళ్లి అయిందా? లేదా? అని ఇలా ఎవరి ఊహకి వారికి వదలడం కన్నా తాప్సీ అధికారికంగా ఓ క్లారిటీ ఇస్తే నెట్టింట జరిగే అన్ని రకాల ప్రచారాలకు ఓ పుల్ స్టాప్ పడుతుంది. డెన్మార్క్ దేశానికి చెందిన బ్యాడ్మింటన్ ఆటగాడు మథియాస్ బోతో తాప్సీ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెల్సిందే. ఇద్దరూ పదేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. అయితే ఆ సమయంలో ఎంతో హుందాగానూ కనిపించారు.
అందరి జంటల్లా నెట్టింట హడావుడి చేసింది లేదు. వ్యవహరమంతా డీసెంట్ గానే నడిపించారు. కలిసి దిగిన ఫోటోలు కూడా నెట్టింట చాలా రేర్ గానో పోస్ట్ చేసేవారు. కలిసి వెకేషన్లకు వెళ్లినా అవి బయటకు రావడానికి చాలా సమయం పట్టేది. వ్యక్తిగత విషయాల్లో ఇద్దరు ఎంతో గోప్యత వహించినట్లు తెలుస్తోంది.
మార్చి 20వ తేదీన ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుపుకుని.. 23వ తేదీన ఉదయ్‌పూర్ వీరి వివాహం అయినట్లు వార్తలొచ్చాయి.