చాలా క‌ప్ప‌ల‌ను ముద్దాడాల్సి వ‌చ్చింది: తాప్సీ

నా రాకుమారుడిని క‌నుగోనే ముందు చాలా క‌ప్ప‌ల‌ను ముద్దాడాల్సొచ్చింది..! అని కొంత ఆవేద‌న‌గా వ్యాఖ్యానించారు తాప్సీ ప‌న్ను.

Update: 2024-03-14 06:08 GMT

నా రాకుమారుడిని క‌నుగోనే ముందు చాలా క‌ప్ప‌ల‌ను ముద్దాడాల్సొచ్చింది..! అని కొంత ఆవేద‌న‌గా వ్యాఖ్యానించారు తాప్సీ ప‌న్ను. ప్ర‌స్తుత‌ చెలికాడు మాథియాస్ బోను తాను క‌ల‌వ‌క ముందు త‌న ప‌రిశ్ర‌మ స్నేహితులు, వారితో ముద్దుల గురించి ప్రస్తావిస్తూ తాప్సీ పైవిధంగా సెటైర్ వేసింది.

కొన్నేళ్లుగా క్రీడాకారుడు కం కోచ్ మాథియాస్ బోతో తాప్సీ ప్రేమాయణం సాగిస్తోంది. ఈ జంట‌ వివాహం గురించి పుకార్లు చాలా వినిపిస్తున్నాయి. కానీ పెళ్లి గురించి అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ రాలేదు. ఈ ఏడాది మార్చిలోనే ఈ జంట పెళ్లి జ‌రుగుతుందని కూడా ప్ర‌చారం సాగుతోంది.

కానీ ఏదీ జ‌ర‌గ‌లేదు. జూమ్‌తో ఒక ఇంటర్వ్యూలో తాప్సీ పన్ను తన పెళ్లి గురించి, రిలేషన్ షిప్ డైనమిక్స్ గురించి క్లారిటీనిచ్చింది. తాప్సీ మాట్లాడుతూ "నేను యువరాజును కనుగొనే ముందు చాలా కప్పలను ముద్దాడాల్సి వచ్చింది. కానీ నేను పరిపక్వత చెంది నా కెరీర్‌ను పరిశీలిస్తున్నప్పుడు, నాకు కావలసింది అబ్బాయి కాదు.. మనిషి అని స్పష్టమైంది. ప‌రిప‌క్వ‌త లేని అబ్బాయికి, ప‌రిపూర్ణుడైన మ‌నిషికి చాలా తేడా ఉంది. పరిణతి చెందిన వ్యక్తి మాత్రమే సంబంధంలో నేను కోరుకున్న భద్రత స్థిరత్వాన్ని అందించగలడని నేను నిశ్చయించుకున్నాను. భావోద్వేగ పెట్టుబడి విషయంలో రాజీ పడేందుకు నేను నిరాకరిస్తాను. ప్రత్యేకించి నా వ్యక్తిగత వృత్తిగ‌త‌ జీవితంలో దాని సుదూర ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటాను. అబ్బాయితో కాకుండా మగవాడితో ఉండాలనే నా నిర్ణయంలో నేను దృఢంగా ఉన్నాను" అని ఘాటుగా వ్యాఖ్యానించింది తాప్సీ.

పెళ్లి పుకార్లను ఉద్దేశించి తాప్సీ మాట్లాడుతూ, "వ్యక్తిగత గోప్యతను విస్మరించి ఒకరి వ్యక్తిగత జీవితంలోకి చొరబడే వ్య‌క్తుల‌ కనికరంలేని ఒత్తిడి నాపై ఉంది. ఒకవేళ నేను ప్రకటన చేయాలని నిర్ణయించుకుంటే.. అది నా నిబంధనల ప్రకారం ఉంటుంది. ఒత్తిడికి గురైనప్పుడు కాకుండా సమయం సరైనది అనిపించినప్పుడు నా జీవితంలోని మైలురాళ్లను ఇత‌రుల‌కు షేర్ చేసుకోవాలని నేను నమ్ముతున్నాను" అని వ్యాఖ్యానించింది.

తాప్సీ ఘాటైన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు టాలీవుడ్ కోలీవుడ్ స‌హా హిందీ సినీప‌రిశ్ర‌మ‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కీ త‌న రాకుమారుడిని క‌నుగొన‌క ముందు తాప్సీ ఎన్ని క‌ప్ప‌ల‌ను ముద్దు పెట్టుకుంది? ఈ క‌ప్ప‌ల జాబితాలో ఎవ‌రెవ‌రు ఉన్నారు? అంటూ నెటిజ‌నుల్లో ఆరాలు మొద‌ల‌య్యాయి. త‌న మాజీ బోయ్ ఫ్రెండ్స్ (ప‌రిశ్ర‌మ స్నేహితుల‌)నే తాప్సీ క‌ప్ప‌ల‌తో పోల్చారా? అంటూ డిబేట్ న‌డుస్తోంది.

Tags:    

Similar News