రహస్యంగా కానిచ్చారు..కానీ చూడగనే లవ్ రాలేదా?
ఆ సంగతి పక్కనబెడితే తాజాగా అమ్మడు ప్రియుడు గరించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాప్సీ-బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియస్ బో మధ్య వ్యవహారం తెలిసిందే. ఇద్దరి మధ్య కొన్నాళ్లగా సీరియస్ రిలేషన్ షిప్ నడుస్తోంది. సీక్రెట్ గా వివాహం కూడా చేసుకున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. కానీ ఇది క్లారిటీ లేని అంశం. తాప్సీ ఎక్కడా పెళ్లి చేసుకున్నట్లు అధికారికంగా చెప్పలేదు. దీంతో ఈ పెళ్లిపై రకరకాల సందేహాలున్నాయి. ఆ సంగతి పక్కనబెడితే తాజాగా అమ్మడు ప్రియుడు గరించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మాథియస్ ని చూడగానే ముందుగా ప్రేమ పుట్టలేదుట. ఓ సాధారణ మనిషిగానే అనిపించిందిట. తొలి చూపులో కేవలం గౌరవం మాత్రమే ఏర్పడిందిట. ఆ తర్వాత రెగ్యులర్ గా కలుసుకోవడం మొదలైన తర్వాత అదే సాధారణ మనషికి మనసులో స్థానం కల్పించినట్లు చెప్పుకొచ్చింది. అలాగని ప్రేమ విషయాన్ని వెంటనే మాథియస్ కి చెప్పలేదుట. మనసులో భావాలు పంచుకోవడానికి చాలా సమయం తీసుకుందిట.
ప్రేమ..పెళ్లి అనేవి వర్కౌట్ అవుతాయా? లేదా? అని కూడా సీరియస్ గానే ఆలోచన చేసిందిట. అలా మాథియస్ తో అమ్మడు లవ్ లో పడినట్లు చెప్పుకొచ్చింది. కానీ పెళ్లి విషయం మాత్రం గోప్యంగానే ఉంచింది. ఆ టాపిక్ ఎక్కడా రాకుండా జాగ్రత్త పడింది. మరి ఇది రిలేషన్ షిపా? ఇద్దరు భార్యాభర్తలు అయ్యారా? లేదా? అన్నది మళ్లీ సస్పెన్స్ న్ గానే ముగించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. తాప్సీ మాథియస్ ని ప్రియుడిగా భావించి మాట్లాడిందా? భర్తగా భావించి స్పందించిందా? అంటూ నెటి జనులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక తాప్సీ కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ కి వెళ్లిన దగ్గర నుంచి బిజీగానే కొనసాగుతుంది. కానీ నటిగా తాప్సీ మార్క్ అయితే ఇంకా పడలేదు. ప్రయత్నాలైతే చేస్తుంది గానీ ఫలించడం లేదు. అటు నిర్మాతగానూ రాణిస్తుంది. అక్కడా ఇంకా సక్సెస్ అవ్వలేదు. నటిగా, నిర్మాతగా ఫాంలో లేకపోయినా కెరీర్ ని మాత్రం ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. టాలీవుడ్ తరహాలో విఫలమైతే కాలేదు.