హీరో మాట్లాడ‌లేద‌ని ట‌బు ఫీలైందా?

ఒకే సినిమాలో హీరో, హీరోయిన్లు క‌లిసి న‌టించిన‌ప్పుడు స‌ర‌దాగా మాట్లాడుకోవ‌డం స‌హ‌జం.

Update: 2024-07-01 07:30 GMT

ఒకే సినిమాలో హీరో, హీరోయిన్లు క‌లిసి న‌టించిన‌ప్పుడు స‌ర‌దాగా మాట్లాడుకోవ‌డం స‌హ‌జం. సెట్స్ లో జోకులేసుకోవ‌డం, రొమాంటిక్ స‌న్నివేశాలు చేస్తోన్న స‌మ‌యంలో సిగ్గుప‌డ‌టం, కోప‌గించుకోవ‌డం వంటివి చోటు చేసుకుంటాయి. కానీ ఆ హీరోతో మాత్రం క‌లిసి ప‌నిచేస్తే ప‌ర‌మ బోరింగ్ అని మ‌రో కంప్లైట్ రెయిజ్ అయింది. ఇంత‌కీ ఎవ‌రా బోరింగ్ స్టార్? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. అత‌ను ఎవ‌రో కాదు అజ‌య్ దేవ‌గ‌ణ్.

న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని సంపాదించుకున్న అజ‌య్ దేవ‌గ‌ణ్ తో సినిమా చేస్తే బోర్ కొడుతుంద‌ని ఇప్ప‌టికే ప‌లువురు భామ‌లు ఆరోపించారు. అత‌డు ఎక్కువ‌గా ఎవ‌రితోనూ మాట్లాడ‌ర‌ని, సింగిల్ గా కుర్చుంటార‌ని, సీన్ పూర్త‌యిన త‌ర్వాత ఒక్క‌డే ఓ మూలకెళ్లి కూర్చుంటాడ‌ని చాలా కాలంగా ఉన్న‌దే. బాలీవుడ్ లో రిజ‌ర్వ్ గా ఉండే హీరో ఎవ‌రంటే ఠ‌క్కున అంతా అజ‌య్ దేవ‌గ‌ణ్ పేరు చెబుతారు.

ఆ విష‌యంలో అంత‌గా ఫేమ‌స్ అయిన ఏకైకా స్టార్ అజ‌య్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా అజ‌య్ దేవ‌గ‌ణ్ విష‌యంలో సీనియ‌ర్ బ్యూటీ ట‌బు కూడా అలా పీలైంద‌న్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. బాలీవుడ్ లో ఇద్ద‌రు జంట‌గా చాలా సినిమాలు చేసారు. స‌క్సెస్ పుల్ జోడీగా పేరుంది. అయితే ఏనాడు ట‌బు బాగా చేసావ్ అని అజ‌య్ మెచ్చుకుంది లేదుట‌. ఏహీరోతోనూ లేని బ్యాడ్ ఎక్స్ పీరియ‌న్స్ అజ‌య్ తో ఆ ర‌కంగా ఏర్ప‌డింద‌ని తెలిపింది.

త‌న‌తో ఎలాంటి హీరో న‌టించినా స‌ర‌దాగా మాట్లాడుతార‌ని, అజ‌య్ మాత్రం ఎన్ని సినిమాలు చేసినా త‌న‌ని ఇంకా కొత్త హీరోయిన్ లాగే ఫీలై మోహ మాట ప‌డ‌తార‌ని తెలిపింది. అజ‌య్ అంత సైలెంట్ గా ఉండే హీరోని ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా చూడ‌లేద‌ని అంది. అయితే కొన్ని విష‌యాల్లో ఇద్ద‌రి మ‌ధ్య చాలా ద‌గ్గ‌ర సంబంధం ఉంటుంద‌ని, అప్పుడ‌ప్పుడు అజ‌య్ లా ఉండ‌టం వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు రావ‌ని త‌నకీ అనిపిస్తుంద‌ని ట‌బ్ అభిప్రాయ‌ప‌డింది.

Tags:    

Similar News