తమన్నా ముంబై పరిచయాల్ని తుటాల్లా దించుతోందిగా!
తాజాగా మరో బాలీవుడ్ సినిమా కి సైన్ చేసింది. నిఖిల్ అద్వాణి తెరకెక్కిస్తోన్న ఓ సినిమా లో అమ్మడు ఓ కీలక పాత్రకి ఎంపికైంది.
మిల్కీబ్యూటీ తమన్నా టాలీవుడ్ లో ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఫేం ఉన్నంత కాలం ఇండస్ట్రీని దున్నేసింంది. పట్టిందల్లా బంగారమే అన్నట్లు అమ్మడి కెరీర్ సాగిపోయింది. ఒక్క బాలయ్య తప్ప చిరంజీవి తరం హీరోల నుంచి ఆ కింద తరం వరకూ అందరితోనూ పనిచేసింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో తనకంటూ కొన్ని పేజీలున్నాయ ని రాసిపెట్టింది. అలాగని టాలీవుడ్‌ని పూర్తిగా విడిచిపెట్టలేదు. అప్పుడప్పుడు వచ్చిన అవకాశాల తో అభిమానుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తుంది.
అయితే అమ్మడి ముందున్న అతిపెద్ద టార్గెట్ ఇప్పుడు బాలీవుడ్ లో సక్సెస్ అవ్వడం. ఇంతకాలం టాలీవుడ్ లో బిజీ గా ఉండటంతో హిందీ సినిమాల పై ఏకాగ్రతగా పనిచేయలేకపోయింది. ఈ నేపథ్యంలో సెకెండ్ ఇన్నింగ్స్ ని బాలీవుడ్ లో దేదీప్యమానంగా సాగిపోయేలా ప్లాన్ చేసుకుంటుంది. సొంత భాషలో సత్తా చాటకపోతే ఎలా అనే పెద్ద ప్లానింగ్ తోనే ముందుకు కదులుతుంది. ఇటీవలే విజయ్ వర్మతో ప్రేమాయణం కన్పమ్ చేసిన సంగతి తెలిసిందే.
ఓ వెబ్ సిరీస్ లో అమ్మడు ఏకంగా ప్రియుడితో ఏ రేంజ్ లో చెలరేగిందో తెలిసిందే. బాలీవుడ్ కి కనెక్ట్ అవ్వడానికి ఆ ఛాన్స్ ని సద్వినియోగం చేసుకుంది. అక్కడ పోటీ ని తట్టుకుని నిలబడాలంటే ఇలాంటి సన్నివేశాలు పడితే తప్ప! పనవ్వదని భావించిన అమ్మడు ఇంటిమేట్ సన్నివేశాల్లో కాక పుట్టించింది. ప్రేమించిన చెలికాడి తోనే ఘాటైన సన్నివేశాల్లో నటించడం తో పెద్దగా నెగిటివిటీ కూడా రాలేదు.
అలా తొలిసారి పెదవి తాంబులం సహా బెడ్ రూమ్ అనుభవాన్ని పంచుకుంది. తాజాగా మరో బాలీవుడ్ సినిమా కి సైన్ చేసింది. నిఖిల్ అద్వాణి తెరకెక్కిస్తోన్న ఓ సినిమా లో అమ్మడు ఓ కీలక పాత్రకి ఎంపికైంది. ఇందులో జాన్ అబ్రహం హీరో. అయితే ఈ సినిమా తమన్నా కి రావడం వెనుక నిఖిల్ కారుకుడని తెలుస్తోంది. ఎప్పటి నుంచో తమన్నాకి నిఖిల్ అద్వాణి తెలుసుట.
ఇద్దరు చాలా కాలంగా స్నేహితులుగానూ మెలుగుతున్నారుట. నిఖిల్ తో పాటు స్టోరీ డిస్కషన్స్ లోనూ చాలాసార్లు పాల్గొందిట. ఈసారి ఆ స్నేహం అక్కడితో పరిమితం చేయకుండా తనకే ఓ పాత్ర రాసేలా తమన్నా ప్రేరేపించినట్లు తెలుస్తోంది. ఇంకా మిల్కీబ్యూటీ అక్కడుండి చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. తన పాత పరిచయాలు అన్నింటిని తూటాల్లా దించి అవకాశాలు అందుకోవడమే టార్గెట్ గా ప్లాన్ చేసుకున్నట్లు వినిపిస్తోంది.