గూగుల్ అతన్ని హీరోగా గుర్తించలేదా..?
తమిళ నటుడు విజయ్ ఆంటోని అనగానే అందరికి గుర్తొచ్చేది బిచ్చగాడు హీరో అనే.. అంతకుముందు మ్యూజిక్ కంపోజర్ గా ఉన్న అతను మొదట కెమియో రోల్ చేసి ఆ తర్వాత లీడ్ రోల్ లో నటిస్తూ వచ్చాడు.
తమిళ నటుడు విజయ్ ఆంటోని అనగానే అందరికి గుర్తొచ్చేది బిచ్చగాడు హీరో అనే.. అంతకుముందు మ్యూజిక్ కంపోజర్ గా ఉన్న అతను మొదట కెమియో రోల్ చేసి ఆ తర్వాత లీడ్ రోల్ లో నటిస్తూ వచ్చాడు. 2006లో కిజక్కు కోడల్ కారై సలై సినిమాలో గెస్ట్ రోల్ చేసిన విజయ్ ఆంటోని ఆ తర్వాత మరో సినిమా చేశాడు ఇక 2012 లో నాన్ సినిమాతో హీరోగా మారాడు ఆ తర్వాత సలీం కూడా అదే క్రమంలో చేశాడు. 2016లో వచ్చిన పిచ్చైకారన్ తెలుగులో బిచ్చగాడు రిలీజైంది. ఆ సినిమా విజయ్ ఆంటోనికి సూపర్ హిట్ అందించింది. బిచ్చగాడు తెలుగు లో సంచలన విజయం అందుకుంది.
బిచ్చగాడు నుంచి విజయ్ వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. తెలుగులో అతని సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే మొదట మ్యూజిక్ కంపోజర్ గా ఉన్న విజయ్ సడెన్ గా హీరోగా మారి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ వస్తున్నాడు. విజయ్ ఇలా మారడం వెనుక రీజన్ ఏంటి అన్నది తెలియదు కానీ మంచి స్టోరీ టెల్లర్ గా తన కథలను ఎంచుకుంటూ సత్తా చాటుతున్నాడు విజయ్ ఆంటోని. తను హీరోగా చేస్తున్న సినిమాలకు తనే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే 2012 నుంచి వరుస సినిమాలు చేస్తున్న విజయ్ ఆంటోనిని ఇప్పటికీ మ్యూజిక్ కంపోజర్ గానే గుర్తిస్తుంది గూగుల్. ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ప్రతి విషయంలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంటుంది కానీ విజయ్ ఆంటోని విషయంలో మాత్రం ఎందుకో వెనక పడింది. దాదాపు 11 ఏళ్లుగా హీరోగా సినిమాలు చేస్తున్న విజయ్ ఆంటోనిని ఆడియన్స్ యాక్టర్ గా గుర్తించగా గూగుల్ మాత్రం ఇంకా అతని పేరు సెర్చ్ చేస్తే ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ అనే చూపిస్తుంది. ఇది చూసిన విజయ్ ఫ్యాన్స్ గూగుల్ మీద కామెంట్స్ చేస్తున్నారు. ఆడియన్స్ అప్డేట్ అయినా గూగుల్ ఇంకా అప్డేట్ అవలేదని రియాక్ట్ అవుతున్నారు.
ఇక విజయ్ ఆంటోని సినిమాల విషయానికి వస్తే బిచ్చగాడు తర్వాత రీసెంట్ గా వచ్చిన బిచ్చగాడు 2 కూడా తెలుగులో హిట్ అయ్యింది. బిచ్చగాడు టైటిల్ తో విజయ్ ఎన్ని సినిమాలు చేసినా సరే అవి వర్క్ అవుట్ అయ్యేలా ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ ఆంటోని కోలై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ సినిమాను తెలుగులో హత్య టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. జూలై 21న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.