ధ‌నుష్..విశాల్..శింబుల‌పై నిర్మాత‌ల మండ‌లి వేటు!

కోలీవుడ్ స్టార్ హీరోల‌కు త‌మిళ చిత్ర నిర్మాత‌ల మండ‌లి షాక్ ఇచ్చింది. ధ‌నుష్.. విశాల్.. అధ‌ర్వ‌.. శింబు ల‌కు రెడ్ కార్డు జారీ చేయాలని నిర్ణ‌యించింది

Update: 2023-09-14 10:33 GMT
ధ‌నుష్..విశాల్..శింబుల‌పై నిర్మాత‌ల మండ‌లి వేటు!
  • whatsapp icon

కోలీవుడ్ స్టార్ హీరోల‌కు త‌మిళ చిత్ర నిర్మాత‌ల మండ‌లి షాక్ ఇచ్చింది. ధ‌నుష్.. విశాల్.. అధ‌ర్వ‌.. శింబు ల‌కు రెడ్ కార్డు జారీ చేయాలని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు బుధ‌వారం సాయంత్రం జ‌రిగిన స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో నిర్మాత‌ల మండ‌లి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నిర్మాత మైఖెల్ రాయ‌ప్ప‌న్ తో ఏర్ప‌డిన వివాదాల కార‌ణంగా శింబుకి రెడ్ కార్డు జారీ చేయ‌నుంది.

ఈ వివాదంపై ఇప్ప‌టికే ఎన్నోసార్లు చ‌ర్చ‌లు జ‌రిపినా శింబు నుంచి ఎలాంటి మార్పు రాక‌పోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అసోసియేష‌న్ తెలిపింది. ప్రొడ్యూస‌ర్ అసోసియేష‌న్ కి అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిం చిన స‌మ‌యంలో అసోసియేష‌న్ నిధుల‌ను విశాల్ దుర్వినియోగం చేశార‌ని ఆరోపిస్తూ ఆయ‌న‌కు రెడ్ కార్డ్ ఇవ్వ‌నున్నారు. అలాగే తెనందాల్ నిర్మాణ సంస్థ‌లో ధ‌నుష్ ఓ చిత్రానికి అంగీక‌రించార‌ని..80 శాతం షూటింగ్ పూర్త‌య్యాక‌..బ్యాలెన్స్ విష‌యంలో ఆస‌క్తి చూపించ‌లేద‌ని..దాని వ‌ల్ల నిర్మాత‌కు న‌ష్టాలు ఏర్ప‌డిన‌ట్లు మండ‌లి తెలిపింది.

ఈ కార‌ణంతోనే ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేర్కొంది. ఇక మ‌దియ‌ల‌క‌న్ నిర్మాణ సంస్థ‌తో అధర్వ ఓ చిత్రానికి ఒకే చేశార‌ని..కాక‌పోతే షూటింగ్ విష‌యంలో ఆయ‌న‌కు ఏమాత్రం స‌హ‌క‌రించ‌డం లేద‌నే ఆరోప‌ణ‌తో అత‌నికి రెడ్ కార్డు ఇవ్వ‌నున్న‌ట్లు మండ‌లి తెలిపింది. దీంతో ఈ ప్ర‌క‌ట‌న కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నేరుగా మండ‌లి అధికారికంగా అన్ని విష‌యాలు మీడియా ముందు ఉంచ‌డంతో ఆ హీరోల పేర్లు నెట్టింట వైల‌ర్ అవుతున్నాయి.

సోష‌ల్ మీడియాలో కొంత నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతోంది. అయితే ఈ రెడ్ కార్డు వివాదంపై ఆ న‌లుగురు హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్ర‌స్తుతం కోలీవుడ్ లో ఆ న‌లుగురు లీడింగ్ లో ఉన్న న‌టులు. కోట్ల రూపాయ‌లు పారితోషికాలు తీసుకుంటున్నారు. ధ‌నుష్ ఇటీవ‌ల తెలుగు సినిమాలు కూడా చేస్తున్నారు. పాన్ ఇండియాలో ఆయ‌న క్రేజ్ ఉంది. అలాంటి న‌టుడు ఇలాంటి వివాదంలో ఇరుక్కోవ‌డ సంచ‌ల‌నంగా మారింది. ఇక విశాల్..శింబుల‌కు వివాదాలు కొత్తేం కాదు. ఎప్ప‌టిక‌ప్పుడు వివాదాల‌తో వాళ్ల పేర్లు తెర‌పైకి వ‌స్తూనే ఉంటాయి.

Tags:    

Similar News