ప్ర‌శాంత్ నీల్ కోసం తార‌క్ స్పెష‌ల్ ఎక్స‌ర్ సైజు ల్లేవా?

అందుకు అవ‌స‌ర‌మైన టీమ్ ని ప్ర‌శాంత్ నీల్ వాళ్లిద్ద‌రికీ అందిచాడు.

Update: 2024-10-17 05:18 GMT

ప్ర‌శాంత్ నీల్ సినిమాలోహీరోలు ఎలా లుక్ ఎలా ఉంటుంది? వాళ్ల పాత్ర‌ల తీరు ఎలా ఉంటుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. `కేజీఎఫ్` లో య‌శ్...`స‌లార్` లో ప్ర‌భాస్ ఏ రేంజ్ లో హైలైట్ అయ్యారో తెలిసిందే. హీరో ఎలివేష‌న్ స‌న్నివేశా ల‌తో సినిమా స‌గం స‌క్సెస్ అయిపోయింది. అయితే ఆ లు క్ కోసం హీరోలు కొంత క‌స‌ర‌త్తు చేసారు. ప్రాజెక్ట్ ప్రారంభం కావ‌డానికి ప్ర‌త్యేకంగా మేకోవ‌ర్ అయ్యారు. అందుకు అవ‌స‌ర‌మైన టీమ్ ని ప్ర‌శాంత్ నీల్ వాళ్లిద్ద‌రికీ అందిచాడు.

కానీ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ విష‌యంలో మాత్రం ఇంకా ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఈ కాంబినేష‌న్ లో సినిమా న‌వంబ‌ర్ నుంచి మొద‌లువుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స్క్రిప్ట్ స‌హా స‌ర్వం సిద్దం చేసుకుని నీల్ రెడీగా ఉన్నాడు. న‌వంబ‌ర్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. అయితే ఈ షూట్ ఎన్టీఆర్ పాల్గొన‌డు. ఆయ‌న లేని సన్నివేశాలు తెర‌కెక్కిస్తారు. తార‌క్ మాత్రం జ‌న‌వ‌రి నుంచి షూట్ కి హాజ‌ర‌వుతారు.

మ‌రి ఈ సినిమా కోసం తార‌క్ స్పెష‌ల్ ట్రైనింగ్ ఏం లేదా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది. ఇంత‌వ‌ర‌కూ తార‌క్ మేకోవ‌ర్ అవుతున్న‌ట్లు ఎక్క‌డా చిన్న వార్త కూడా రాలేదు. జ‌న‌వ‌రి నుంచి షూట్ కి హాజ‌ర‌వుతాను అన్న విష‌యాన్ని మాత్రం తార‌క్ స్వ‌యంగా రివీల్ చేసారు. అంత‌కు మించి తార‌క్ లుక్ ప‌రంగా ఏవైనా మార్పులు చేయాల్సి వ‌స్తోందా? క‌థ ఇలా ఉండ‌బోతుంది? అని గానీ ఎక్క‌డా నీల్ గానీ, తార‌క్ గానీ లీక్ చేయ‌లేదు. సాధార‌ణంగా అభిమానుల‌కు చిన్న‌పాటి హింట్ లు ఇవ్వ‌డం తార‌క్ కి అల‌వాటు.

కానీ ఈ సినిమా విష‌యంలో ఎలాంటి లీక్ ఇవ్వ‌లేదు. తార‌క్ పాత్ర‌కి సంబంధించి సోష‌ల్ మీడియాలో కూడా ఎలాంటి గెస్సింగ్స్ సైతం తెర‌పైకి రావ‌డం లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే న‌వంబ‌ర్ లో షూట్ మొద‌లైతే? ఏదైనా కొత్త విష‌యం తెలిసే అవ‌కాశం ఉంటుంది.

Tags:    

Similar News