బ్రేకప్ రూమ‌ర్ కి ఇలా పెట్టిందా?

అభిప్రాయ బేధాలు రావ‌డంతో బ్రేక‌ప్ తో దూరంగా ఉండ‌ట‌మే మంచిద‌ని ఇరువురు నిర్ణ‌యించుకుని ముందుకెళ్తున్న‌ట్లు ప్ర‌చారం సాగింది.

Update: 2024-06-28 01:30 GMT

బాలీవుడ్ బిగ్ బాస్ విన్న‌ర్ తేజస్వీ ప్రకాశ్- క‌ర‌ణ్ కుంద్రా జోడీ విడిపోయిందంటూ కొన్ని రోజులుగా మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. మూడేళ్ల ప్రేమకి పుల్ స్టాప్ పెడుతూ ఎవ‌రి స్వేచ్ఛ వారు కోరుకుంటున్న‌ట్లు నెట్టింట పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. అభిప్రాయ బేధాలు రావ‌డంతో బ్రేక‌ప్ తో దూరంగా ఉండ‌ట‌మే మంచిద‌ని ఇరువురు నిర్ణ‌యించుకుని ముందుకెళ్తున్న‌ట్లు ప్ర‌చారం సాగింది.

వాళ్ల స‌న్నిహిత వ‌ర్గాల నుంచి సైతం విడిపోతున్న‌ట్లే లీకులందాయి. అయితే ఇంత‌వ‌ర‌కూ ఈ క‌థ‌నాల‌పై అస‌లి వ్య‌క్తులు స్పందించింది లేదు. మీడియాలో ప్ర‌చారం త‌ప్ప ఇందులో నిజ‌మెంతో? తెలియ‌ని గంద‌ర‌గోళం క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా అన్ని ప్ర‌చారాల‌కు పుల్ స్టాప్ ప‌డుతూ ఇన్ స్టాలో ఓ ఫోటో షేర్ చేసింది తేజ‌స్వీ. మేము ఎక్క‌డ విడిపోయాం. ఇద్ద‌రం సంతోషంగా ఉన్నామంటూ తెలియ‌జేస్తూ విదేశాల్లో దిగిన ఓ ఫోటోని పోస్ట్ చేసింది.

ఇందులో తేజ‌స్వినీ ప్రియుడి భుజాల‌పై వాలి ప్రేమ‌ను పంచుతుంది. క‌ర‌ణ్ అంతే ఆప్యాయంగా హ‌త్తుకుని క‌నిపిస్తున్నాడు. `కరణ్: నేను ఆమెను ఉత్తమంగా క్లిక్ చేస్తానా? లేదా? అన‌గా తేజస్వి: ప్రేమ అనేది తెలిసిన అనుభూతి అంటూ ల‌వ్ సింబ‌ల్ జోడింది. మీకు ఇష్టమైన శీర్షికను ఎంచుకోండి అంటూ ఫోటోని ఉద్దేశించి రాసుకొచ్చింది. దీంతో ఇద్దరు ప్రేమ‌లో ఎంతో సంతోషంగా ఉన్నార‌ని తేలిపోయింది. విడిపోయారు అన్న‌ది కేవ‌లం నెట్టింట జ‌రిగే త‌ప్పుడు ప్ర‌చారమ‌ని అర్ద‌మ‌వుతుంది. దీంతో బ్రేక‌ప్ ప్ర‌చారానికి నేటితో తెర‌ప‌డిన‌ట్లే.

తేజ‌స్విని గతంలో పలు సినిమాల్లో, రియల్స్ లో నటించింది. అయితే బిగ్ బాస్ ద్వారా ఈ బ్యూటీ మంచి ఫేమ్ ను సంపాదించింది. ఆమె కంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనేక హిందీ సీరియల్స్ లో నటించి..బుల్లితెర ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. తేజస్వీ ప్రస్తుతం ఏక్తా కపూర్ సూపర్ నేచురల్ టీవీ షో నాగిన్- 6లో నటిస్తోంది.

Tags:    

Similar News