టాలీవుడ్ సెకండాఫ్.. సినిమాలే సినిమాలు!

2024 టాలీవుడ్ ఫస్టాఫ్ మరో 12 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. కానీ ఈసారి పెద్దగా సినిమాల సందడే కనిపించలేదు

Update: 2024-06-18 13:53 GMT

2024 టాలీవుడ్ ఫస్టాఫ్ మరో 12 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. కానీ ఈసారి పెద్దగా సినిమాల సందడే కనిపించలేదు. సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వగా.. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ విన్నర్ గా నిలిచింది. మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామి రంగా చిత్రాలు సాలిడ్ వసూళ్లు రాబట్టాయి. ఆ తర్వాత పలు చిన్న చిత్రాలు రిలీజ్ అవ్వగా.. కొన్ని హిట్.. మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి.

ఇక మార్చిలో రిలీజైన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏప్రిల్ లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్నికలు, ఐపీఎల్ వల్ల వేసవి అంతా వేస్ట్ అయిపోయింది. బడా హీరోల చిత్రాలు దేవర, కల్కి పోస్ట్ పోన్ అయ్యాయి. చిన్న చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు సెకండాఫ్ లో వరుసగా అనేక సినిమాలు అలరించనున్నాయి.

టాలీవుడ్ సెకండాఫ్ జులై నుంచి స్టార్ట్ అయినా... జూన్ నెలఖారులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రూ.600 కోట్ల బడ్జెట్ తో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ మూవీ.. జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. ఆ తర్వాత జులై 12న కమల్ హాసన్.. ఇండియన్-2 విడుదల కానుంది.

ఇక ఆగస్టులో రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మూవీ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే డేట్ కు షెడ్యూల్ అయిన అల్లు అర్జున్ పుష్ప-2 పోస్ట్ పోన్ అయింది. అదే నెల 29వ తేదీన నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం చిత్రం రిలీజ్ అవ్వనుంది. ఆగస్టులో రిలీజ్ అవ్వనున్న రెండు సినిమాలపై కూడా ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది. సెప్టెంబర్ 5వ తేదీన విజయ్ GOAT మూవీ రానుంది.

Read more!

ఆ తర్వాత సెప్టెంబర్ 27వ తేదీన జూనియర్ ఎన్టీఆర్.. దేవర విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ ఓజీ, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాలు కూడా అదే డేట్ కు షెడ్యూల్ అయినా.. వాయిదా పడే అవకాశం ఉంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వేట్టియాన్ మూవీతో అక్టోబర్ 10వ తేదీన రానున్నారు. డిసెంబర్ 6న బన్నీ పుష్ప-2, 20న నితిన్ రాబిన్ హుడ్, 21న నాగ చైతన్య తండేల్ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ అయిన సినిమాల లిస్ట్ మరోసారి మీకోసం.

జూన్ 27: కల్కి 2898 ఏడీ

జులై 12: భారతీయుడు 2

ఆగస్టు 15: డబుల్ ఇస్మార్ట్

ఆగస్టు 29: సరిపోదా శనివారం

సెప్టెంబర్ 5: GOAT

సెప్టెంబర్ 27: దేవర, లక్కీ భాస్కర్, ఓజీ

అక్టోబర్ 10: వేట్టియాన్

డిసెంబర్ 6: పుష్ప 2

డిసెంబర్ 20: రాబిన్‌ హుడ్

డిసెంబర్ 21: తండేల్

వీటితోపాటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ డిసెంబర్ లోనే రిలీజ్ అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే టాలీవుడ్ లో చాలా సినిమాలు ఇప్పటికే సెట్స్ పై ఉన్నాయి. రవితేజ మిస్టర్ బచ్చన్, గోపీచంద్ విశ్వం, నితిన్ తమ్ముడు, కన్నప్ప, విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి సినిమా, వరుణ్ మట్కా, ధనుష్- నాగార్జున కుబేర, అల్లరి నరేష్ బచ్చల మల్లి, బెల్లంకొండ శ్రీనివాస్ టైసన్ నాయుడు, నిఖిల్ స్వయంభు సినిమాలు రిలీజ్ డేట్ ఖరారు చేసుకోవాల్సి ఉంది.

Tags:    

Similar News