రౌడీ హీరో సరసన తెలుగమ్మాయి.. గోల్డెన్ ఛాన్స్
అందులో 'గీత గోవిందం' ఫేమ్ పరశురాం 'ఫ్యామిలీ స్టార్' ఒకటైతే.. మరొకటి జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఉండబోతోంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో 'గీత గోవిందం' ఫేమ్ పరశురాం 'ఫ్యామిలీ స్టార్' ఒకటైతే.. మరొకటి జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఉండబోతోంది. ఈ ప్రాజెక్టుని అఫీషియల్ గా అనౌన్స్ చేసి దాదాపు 8 నెలలు కావస్తోంది. కానీ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళనే లేదు. #VD12 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
ఇందులో విజయ్ దేవరకొండ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన శ్రీ లీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ మూవీ షూటింగ్ శ్రీ లీల వల్లే ఆలస్యం అయ్యింది. శ్రీలీలా వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు కోసం డేట్స్ కేటాయించలేకపోయింది. దాంతో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లకుండా వాయిదా పడుతూ వచ్చింది.
ఇక ఇటీవల ఈ ప్రాజెక్టు నుండి శ్రీ లీల తప్పుకోవడంతో ఆమె స్థానంలో యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి తో పాటూ 'సప్త సాగరాలు దాటి' హీరోయిన్ రుక్మిణి వసంత్ లను మూవీ టీం పరిశీలిస్తున్నట్లు రీసెంట్ గా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ లిస్టులో మరో హీరోయిన్ కూడా చేరింది.
లేటెస్ట్ ఫిలింనగర్ టాక్ ప్రకారం.. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ను నూరి ప్రాజెక్టులో హీరోయిన్ గా శ్రీలీల స్థానంలో మీనాక్షి చౌదరిని రీప్లేస్ చేస్తున్నారట. మీనాక్షి చౌదరి రీసెంట్ గా 'గుంటూరు కారం' సినిమాలో మహేష్ మరదలుగా కనిపించింది. కానీ సినిమాలో ఆమె రోల్ కి ఎలాంటి ఇంపార్టెన్స్ దక్కలేదు. దానికి తోడు సినిమా మొత్తంలో ఆమె కనిపించింది కొద్ది నిమిషాలు మాత్రమే.
ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ సరసన గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టులో హీరోయిన్ గా ఫిక్స్ అయిందని అంటున్నారు. అయితే మూవీ టీం నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాని పూర్తి చేసిన వెంటనే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టుని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది.