కొత్త కారు కోసమే రోల్స్ రాయ్స్ అమ్మేస్తున్నాడా?
తలపతి విజయ్ తన రోల్స్ రాయ్స్ కారు అమ్మకానికి పెట్టినట్లు ఇటీవల ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే
తలపతి విజయ్ తన రోల్స్ రాయ్స్ కారు అమ్మకానికి పెట్టినట్లు ఇటీవల ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎంపైర్ ఆటోస్ కార్ డీలర్ షిప్ విజయ్ రోల్స్ రాయ్స్ అమ్మకానికి వచ్చినట్లు వెల్లడిం చినట్లు ప్రచారంలోకి వచ్చింది. దీని ధర 26 కోట్ల గా మార్క్ చేసి చెప్పారు. అయితే విజయ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా లేక పోవడంతో నిజంగా అమ్ముతున్నాడా? లేదా? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి.
ఎంతో ఇష్టపడి కొనుక్కున్న రోల్స్ రాయ్స్ ని ఎందుకు అమ్మేస్తాడు? అని నెట్టింట పెద్ద చర్చ సాగింది. తాజాగా దీనికి సంబంధించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. రోల్స్ రాయిస్ విక్రయించి కొత్తగా లెక్సస్ కారును కొనుగోలు చేయాలనే ఉద్దేశంతోనే విజయ్ రోల్స్ రాయ్స్ ని బేరానికి పెట్టినట్లు వినిపిస్తుంది. మరి ఇది నిజమైతే? విజయ్ ఇంట కొత్త కారు వస్తుంది. విజయ్ కి కార్లు అంటే పిచ్చి.
ఆయన వద్దకార్ల కలెక్షన్ ఉంటుంది. అన్నీ లగ్జరీ బ్రాండెండ్ కార్లు కనిపిస్తుంటాయి. రోల్స్ రాయిస్ లో జర్నీ చేస్తూ ఎన్నోసార్లు మీడియా కంట పడ్డాడు. ఆ వీడియోలు అభిమానుల్ని ఎంతగానో అలరించాయి. అయితే ఇదే రోల్స్ రాయ్స్ విజయ్ ని కొన్ని ఇబ్బందులు పెట్టింది. 2012 లో ఈ కారును ఎంతో ఇష్టపడి విజయ్ కొనుగోలు చేసారు. ప్రత్యేకంగా విదేశాలను ఇండియాకి తెప్పించారు.
కొనుగోలు చేసిన అనంతరం లోకల్ ట్యాక్స్ కట్టలేదనే అరోపణలు విజయ్ ఎదుర్కున్నాడు. ఈ వ్యవహారంలో విజయ్ కోర్టు మెట్టు సైతం ఎక్కారు. కానీ అక్కడా విజయ్ కి భంగపాటు తప్పలేదు. చెన్నై కోర్టు లక్ష రూపాయలు జరిమానా కూడా విధించింది. అదుకు గల అసలు కారణాలు ఏంటి? అన్నది తెలియదు గానీ విజయ్ తనవైపు నుంచి చట్టపరంగా ఎలాంటి తప్పిదం చోటుచేసుకోలేదని చెప్పే ప్రయత్నం చేసారు. ఆ కారణంగానూ కారు అమ్మేస్తున్నాడనే ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతం విజయ్, వెంకట్ ప్రభు దర్శకత్వంలో `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.