సంక్రాంతి పందెం కోడి.. తనతో తనకే పోటీ..!
సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల ఫైట్ ఊహించిందో ఈ సారి సీనియర్ స్టార్స్ బాలకృష్ణ, వెంకటేష్ లతో పోటీ పడుతున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.
సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల ఫైట్ ఊహించిందో ఈ సారి సీనియర్ స్టార్స్ బాలకృష్ణ, వెంకటేష్ లతో పోటీ పడుతున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. గేమ్ ఛేంజర్ సినిమాతో సంక్రాంతికి ముందు వస్తున్న చరణ్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఐతే ఆ తర్వాత రెండు రోజులకు బాలయ్య డాకు మహారాజ్, నెక్స్ట్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం వస్తున్నాయి. ఐతే ఈ సంక్రాంతికి నిర్మాతగా దిల్ రాజు తన సినిమాతో తనకే పోటీ అవుతున్నా రెండు సినిమాల మీద భారీ నమ్మకంతో ఉన్నాడు.
ఐతే దిల్ రాజు మాత్రమే కాదు థమన్ కూడా ఈ సంక్రాంతికి రెండు సినిమాలతో వస్తున్నాడు. సంక్రాంతి పందెం కోడిగా గేమ్ ఛేంజర్ కు ట్రెండీ మ్యూజిక్.. డాకు మహారాజ్ కు మాస్ మ్యూజిక్ ఇలా రెండిటితో థమన్ పోటీకి వస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే గేమ్ ఛేంజర్ వర్సెస్ డాకు మహారాజ్ అంటే తన సినిమాకు తానే పోటీగా వస్తున్నాడన్నమాట.
గేమ్ ఛేంజర్ సినిమా మ్యూజిక్ విషయంలో థమన్ చాలా కంగారు పడ్డాడు. ఎందుకంటే శంకర్ డైరెక్షన్ లో సినిమా.. తన మ్యూజిక్ కంపోజింగ్ అనేది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. ఐతే శంకర్ ని మాత్రమే కాదు మెగా ఫ్యాన్స్ ని కూడా పూర్తిగా సంతృప్తి పరచే మ్యూజిక్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఇక బిజిఎం ఎలా ఉంటుంది అన్నది చూడాలి. మరోపక్క డాకు మహారాజ్ సినిమాకు మాత్రం థమన్ మరోసారి ఊర మాస్ బీట్ వాడినట్టు అనిపిస్తుంది.
బాలయ్య సినిమా అనగానే థమన్ స్పెషల్ కేర్ తీసుకుంటాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఇస్తాడు. సో థమన్ ఈ రెండు సినిమాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. మ్యూజిక్ పరంగా రెండిటికీ తన బెస్ట్ ఇచ్చిన థమన్ సినిమా ఫలితాలు ఏదైనా తన వరకు 100 పర్సెంట్ సాటిస్ఫై అన్నట్టు ఉంది. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా పండగ టైం కాబట్టి ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. ఐతే ఈ ఫెస్టివల్ కి తెలుగులో 3 క్రేజీ సినిమాలు వస్తున్నాయి. వేటికవే ప్రత్యేకం కాగా వీటిలో ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి. రాబోతున్న 3 సినిమాల్లో థమన్ రెండు సినిమాలకు మ్యూజిక్ అందించగా వెంకటేష్ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. ఆ సినిమా సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి.