థమన్ OG ఇంత గట్టిగా చెబుతున్నాడు అంటే..!

థమన్ ఇంత గట్టిగా చెబుతున్నాడు అంటే ఓజీ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మరో బ్లాక్ బస్టర్ బొమ్మ రెడీ అవుతుందని అర్థమవుతుంది

Update: 2023-08-08 16:30 GMT

దేవి శ్రీ ప్రసాద్, థమన్ ఇద్దరు సూపర్ ఫాంలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్.. అయితే దేవి కన్నా థమన్ ఇంకాస్త ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో థమన్ మ్యూజిక్ హవా నడుస్తుంది. థమన్ సినిమాల్లో పాటల కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. కొన్ని సినిమాలకు థమన్ ఇచ్చిన RR సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ క్రమంలో థమన్ తన లేటెస్ట్ సినిమాల గురించి ఇచ్చిన ఇంటర్వ్యూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో థమన్ వరుస సినిమాలు చేస్తున్నాడు.

పవర్ స్టార్ సినిమాకు మ్యూజిక్ అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఫ్యాన్స్ కి నచ్చే ట్యూన్స్.. మెచ్చే బిజిఎం ఇవ్వాల్సిందే. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రీసెంట్ గా వచ్చిన బ్రో సినిమాకు కూడా థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.

ఆ సినిమాల్లో సాంగ్స్ కన్నా థమన్ మార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదుర్స్ అనిపించింది. ఇదిలా ఉంటే పవన్ చేస్తున్న ఓజీ సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా గ్యాంగ్ స్టర్ కథతో వస్తుంది. సినిమా కథకు తగినట్టుగా థమన్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్నాడట.

పవన్ ఓజీ గురించి ఆ సినిమా మ్యూజిక్ గురించి తన రీసెంట్ ఇంటర్వ్యూలో స్పెషల్ గా ప్రస్తావించాడు థమన్. సినిమా మ్యూజిక్ వేరే లెవెల్ లో ఉంటుందని ఫ్యాన్స్ అందరికీ ఆ సినిమా మంచి ఫీస్ట్ అందిస్తుందని అన్నాడు.

థమన్ ఇంత గట్టిగా చెబుతున్నాడు అంటే ఓజీ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మరో బ్లాక్ బస్టర్ బొమ్మ రెడీ అవుతుందని అర్థమవుతుంది. ఈమధ్య స్టార్ సినిమాలకైనా చిన్న సినిమాలకైనా మ్యూజిక్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది.

సినిమా మ్యూజిక్ ప్రాముఖ్యత కనిపెట్టిన మేకర్స్ సినిమాలో సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఎక్కువ టైం తీసుకుని ఫ్యాన్స్ ని మెప్పించేలా చేస్తున్నారు. పవర్ స్టార్ OG సినిమా అంతా ఒక ఎత్తు మ్యూజిక్ మరో ఎత్తు అనేలా థమన్ అంచనాలు పెంచుతున్నాడు.

మరి ఆ సినిమాకు థమన్ ఇచ్చే మ్యూజిక్ కి రికార్డుల సౌండ్ ఏ రేంజ్ లో వినిపిస్తుందో చూడాలి. ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Tags:    

Similar News