తంగలాన్ టైటిల్ వెనుక కథ ఏంటో తెలిసిపోయింది

పా రంజిత్ తంగలాన్ సినిమాతో డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకొని వెళ్లిపోయాడని ప్రేక్షకులు అంటున్నారు.

Update: 2024-08-15 09:45 GMT

చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన పాన్ ఇండియా మూవీ తంగలాన్. పీరియాడికల్ జోనర్ లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం ఉంటుందని ట్రైలర్ తోనే అర్ధమైంది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ రెండు భిన్నమైన పాత్రలలో కనిపించారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది. పా రంజిత్ తంగలాన్ సినిమాతో డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకొని వెళ్లిపోయాడని ప్రేక్షకులు అంటున్నారు.

మూవీలో చియాన్ విక్రమ్ క్యారెక్టర్ కూడా చాలా భిన్నంగా ఉందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తంగలాన్ అనే టైటిల్ ని ఈ సినిమాకి ఎందుకు పెట్టారనే ప్రశ్న మొదటి నుంచి చాలా మందికి ఉంది. అదే టైటిల్ ని అన్ని భాషలలో కూడా ఉంచారు. దానికేదో రీజన్ ఉండే ఉంటుందని చాలా మంది నమ్మారు. మూవీ చూసిన తర్వాత టైటిల్ ఎందుకు పెట్టారనేది క్లారిటీ వచ్చింది.

ఈ సినిమాలో తంగలాన్ అనేది ఒక గిరిజన తెగ పేరు. ఈ తెగకి చెందిన వారు పూర్వకాలంలో ఉండేవారు. ఆ గిరిజన తెగకి చెందిన కథగా ఈ చిత్రాన్ని పా రంజిత్ తెరకెక్కించారు. తంగలాన్ తెగ ప్రజలు తమపై జరిగే అణచివేతపై ఎదురుతిరిగి పోరాటం చేస్తారు. వారికి నాయకుడిగా చియాన్ విక్రమ్ క్యారెక్టర్ ఉంటుంది. స్వేచ్ఛ కోసం వారు ఎలాంటి తిరుగుబాటు చేశారు అనేది కథలో ప్రధానంగా పా రంజిత్ చూపించారంట.

ఈ కథ కోలార్ గోల్డ్ మైనింగ్స్ నేపథ్యంలో ఉంటుంది. అందుకే కేజీఎఫ్ స్టోరీకి, తంగలాన్ కి దగ్గర పోలికలు ఉంటాయా అనే ప్రశ్న కూడా వినిపించింది. తంగలాన్ కథ నిజంగా ఆ ప్రాంతంలో జరిగిన సంఘటనల ఆధారంగా చేసుకొని పా రంజిత్ రాసుకున్నది. గోల్డ్ మైనింగ్ పాయింట్ కథలో భాగంగా ఉన్నా కూడా మెయిన్ స్టోరీలైన్ మాత్రం తంగలాన్ కమ్యూనిటీ పోరాటం నేపథ్యంలోనే ఉంటుంది.

చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో విక్రమ్ సక్సెస్ ని అందుకునేలా ఉన్నాడనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇలాంటి పీరియాడిక్ యాక్షన్ కథలని ఇప్పుడు ప్రేక్షకులు ఎక్కువ ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా తంగలాన్ మూవీ ప్రేక్షకాదరణ సొంతం చేసుకునే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది.

Tags:    

Similar News