ట్రైలర్ టాక్: శృంగారంలో క్లైమాక్స్ ప్రాప్తించని మగువ కథ
సున్నితమైన కపుల్ గోల్స్, బెడ్ రూమ్ విషయాలను ఎంతో బోల్డ్ గా వెండితెరపై ఆవిష్కరించేందుకు నవతరం దర్శకులు వెనకాడడం లేదు
సున్నితమైన కపుల్ గోల్స్, బెడ్ రూమ్ విషయాలను ఎంతో బోల్డ్ గా వెండితెరపై ఆవిష్కరించేందుకు నవతరం దర్శకులు వెనకాడడం లేదు. సంఘంలో చర్చకు తెర తీసే విషయాలను తెలివిగా ఎంపిక చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే చాలా ప్రయోగాత్మక చిత్రాలు యువతరాన్ని ఆకట్టుకున్నాయి. ఇదే కోవలో ఇప్పుడు స్త్రీ శృంగార జీవితం, ఆలోచనలు, ఆర్గాజమ్ వంటి అంశాలను స్పృశిస్తూ కరణ్ బూలాని దర్శకత్వం వహించిన తాజా సినిమా 'థాంక్స్ ఫర్ కమింగ్'. ఆయిషా, ఖూబ్‌సూరత్, వీరే డి వెడ్డింగ్ లాంటి విమర్శకుల ప్రశంసలు పొందిన పవర్‌హౌస్ సృష్టికర్తలు ఈ చిత్రాన్ని నిర్మించారు. మంత్రముగ్ధులను చేసే అద్భుత కథ తో రూపొందిన 'థాంక్యూ ఫర్ కమింగ్' త్వరలో మీ ముందుకు వస్తోంది అంటూ చిత్రబృందం ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సరదా పోస్టర్‌లతో ఎగ్జయిట్ మెంట్ పెంచింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతోంది.
ట్యాలెంటెడ్ కరణ్ బూలాని బెడ్ రూమ్ కి సంబంధించిన ఒక సెన్సిటివ్ అంశాన్ని ఎంపిక చేసుకుని ఎంతో గ్రిప్పింగ్ గా హ్యాండిల్ చేశాడని ట్రైలర్ తో అర్థమవుతోంది. ఈ చిత్రంలో భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్, డాలీ సింగ్, కుషా కపిల, షిబానీ బేడీ, ప్రధుమాన్ సింగ్ మాల్, నటాషా రస్తోగి, గౌతమిక్, సుశాంత్ దివ్గీకర్, సలోని దైనీ, డాలీ కరన్ క్లువాలియా, డాలీ అహ్లూరియా, డాలీ అహ్లూరియా వంటి అద్భుతమైన తారాగణం నటించారు. సీనియర్ హీరో అనిల్ కపూర్ ప్రత్యేక పాత్రలో కనిపించారు.
ఈ చిత్రానికి సంబంధించిన మరో ప్రత్యేకత ఏమిటంటే, 15 సెప్టెంబర్ 2023న ప్రతిష్టాత్మకమైన రాయ్ థామ్సన్ హాల్‌లో 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో గ్రాండ్ గాలా వరల్డ్ ప్రీమియర్ కోసం ఎంపిక చేయబడిన ఏకైక హిందీ చలనచిత్రంగా రికార్డులకెక్కింది. ట్రైలర్‌లో కనికా కపూర్ పరిచయం... భూమి ఫెడ్నేకర్ ఆర్గాజమ్ సమస్యను ఎంతో ఫన్నీగా ఎలివేట్ చేసారు. ముప్పై ఏళ్ల యువతికి శృంగారపురుషులతో సుఖం అన్నదే దక్కదు. ఆమె గందరగోళంతో నిండిన జీవితంతో పోరాడుతోంది. ఈ చిత్రం ప్రేమ, స్నేహం, శృంగార జీవితంలోని ఆనందం వంటి సెన్సిటివ్ విషయాలను టచ్ చేస్తూ బోల్డ్ గా సాగుతుంది.
దర్శకుడు కరణ్ బూలానీ ట్రైలర్ లాంచ్ వేడుకలో ఈ సినిమా కథ పుట్టుకకు కారణాలు తెలిపారు. బూలానీ మాట్లాడుతూ-''నా జీవితమంతా నమ్మశక్యం కాని మహిళలతో కొనసాగడం నా అదృష్టం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఒక వ్యక్తిగా థాంక్స్ ఫర్ కమింగ్ నాకు చాలా నేర్పింది. కోరిక, ప్రేమ, అంగీకారం వంటి విషయాలతో స్త్రీ అనుభవం గురించిన సినిమా ఇది. ప్రేక్షకులు చాలా ఆస్వాధిస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు. నిర్మాత రియా కపూర్ మాట్లాడుతూ-''ప్రపంచంలోని అద్భుతమైన అమ్మాయిల కోసం ఇలాంటి విభిన్నమైన చిత్రాలను తీయడానికి నేను అన్ని అసమానతలకు వ్యతిరేకంగా వెళ్ళగలగడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఒక నియమం కావాలని నా ఏకైక ఆశ. ఇది నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి నుండి ప్రేరణ పొందింది. నేను ఇష్టపడే చాలా మంది ఆత్మీయంగా ఈ చిత్రంలో ఉన్నారు. నేను నిజంగా ఆ సందేశాన్ని అందించగలనని ఆశిస్తున్నాను. సినిమా అందరినీ అలరిస్తూ, ఆనందాన్ని పంచుతుంది'' అన్నారు.
బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏక్తా ఆర్ కపూర్ మాట్లాడుతూ-''రియా .. నేను ఎప్పుడూ మహిళలకు సాధికారత కలిగించే కథలను చెప్పడానికి ప్రయత్నించాము. అదే సమయంలో వినోదభరితంగా ఉండే కథల్ని ఎంపిక చేసుకున్నాం. థ్యాంక్యూ ఫర్ కమింగ్ .. నేటి కాలనుగుణంగా మేము అలాంటి కథను చెప్పగలిగినందుకు చాలా గర్వపడుతున్నాను'' అన్నారు. బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ - అనిల్ కపూర్ ఫిల్మ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమాని నిర్మించాయి. కరణ్ బూలాని దీనికి దర్శకత్వం వహించారు. రాధికా ఆనంద్- ప్రశస్తి సింగ్ రచించారు. 6 అక్టోబర్ 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదలవుతోంది.