భార‌త్ లో ఆ సినిమా బ‌హిష్క‌ర‌ణ‌!

పాకిస్తాన్ మూవీ `దిలెజెండ్ ఆఫ్ హౌలా జాట్` అక్క‌డ మంచి విజ‌యం సాధించింది.

Update: 2024-09-29 01:00 GMT

పాకిస్తాన్ మూవీ `దిలెజెండ్ ఆఫ్ హౌలా జాట్` అక్క‌డ మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమా అక్క‌డ ప్రేక్ష‌కులు ఇండియ‌న్ బాహుబ‌లిలా పేర్కొంటున్నారు. అస‌లే పాకిస్తాన్ ఇండ‌స్ట్రీ వెనుక‌బ‌డి ఉంది. అలాంటి స‌మ‌యంలో ఇలాంటి స‌క్సస్ ఇండ‌స్ట్రీకి రావ‌డంతో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే ఇప్పుడా పాకిస్తాన్ మూవీ భార‌త్ లో విడుద‌ల‌కు అనుమ‌తి ల‌భించ‌డం లేదు.

2016 నుంచి భార‌త్ సినిమాల్ని పాకిస్తాన్ బ్యాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈనేప‌థ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ సినిమాకి భార‌త ప్ర‌భుత్వం అనుమ‌తివ్వ‌డం లేదని తెలుస్తోంది. ఈ సినిమా కేవ‌లం పంజాబ్ లో మాత్ర‌మే అందుబాటులోఉంటుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని రోజుల క్రితం మ‌హ‌రాష్ట్ర న‌వ నిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే ఈ సినిమా విడుద‌ల చేస్తే బాగుండుద‌ని హెచ్చ‌రించారు.

మ‌హ‌రాష్ట్ర‌లోనూ రిలీజ్ అవ్వ‌డానికి వీల్లేద‌ని ..ఆ పార్టీ అనుతించ‌ద‌ని ట్వీట్ చేసారు. భార‌త్ లోనే కాదు ఏ దేశం కూడా పాకిస్తాన్ సినిమాలు అనుమ‌తి ఇవ్వ‌కూడ‌ద‌ని కోరారు. అనంద్ దూబే కూడా ఈ సినిమాపై అగ్ర‌హం వ్య‌క్తం చేసారు. దీంతో పాకిస్తాన్ బాహుబ‌లికి ఇండియాలో నో ఛాన్స్ అన్న‌ట్లే క‌నిపిస్తుంది.

అయితే పాకిస్తాన్ న‌టులు ప‌లు సంద‌ర్భాల్లో క‌ళాకారుల్ని రాజ‌కీయాల్లోకి లాగొద్ద‌ని కోరారు. రాజ‌కీయాల‌కు అతీతంగా త‌మ‌ని రెండు దేశాలుస్వాగ‌తించాల‌ని కోరారు. కానీ అది సాధ్య‌ప‌డ‌లేదు. పాకిస్తాన్ చ‌ర్య‌లు అంత‌కంత‌కు రెచ్చ‌గొట్టే రీతున ఉన్నాయి త‌ప్ప స్వాగ‌తించే ప‌రిస్థితుల్లో లేవ‌ని నాయ‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. పాకిస్తాన్ లో జ‌రిగే ట్రోపీకి భార‌త్ టీమ్ హాజ‌ర‌వుతుందా? లేదా? అన్న దానిపై కూడా ఇంకా స్ప‌ష్ట‌త లేదు.

Tags:    

Similar News