గుంటూరు కారం.. అంత మాట అనేశారేంటి?
అంతే కాకుండా సంక్రాంతికి చాలా సినిమాలు పోటీలో ఉన్నాయి కాబట్టి నిర్మాతలు ఎవరైనా సంప్రదించరా గిల్డ్ తో కలిసి మాట్లాడారా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి ఇక ఆ విషయంలో వంశీ చాలా ధీమాగా సమాధానం ఇచ్చారు.
సంక్రాంతి పోటీపై చాలా రోజులుగా నిర్మాతలకు దర్శకులకు అలాగే నటీనటులకు పలు రకాల ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎలాంటి ప్రెస్ మీట్ జరిగిన కూడా సంక్రాంతి పోటీలో వారి సినిమా ఉంటే అనేక రకాల సందేహాలు అయితే వారి ముందు పెడుతున్నారు. ఆ ప్రశ్నలకు ఎవరికి తోచినట్టుగా వారు సమాధానాలు అయితే ఇస్తున్నారు. కానీ రీసెంట్ గా గుంటూరు కారం నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ ఇచ్చిన సమాధానం హాట్ టాపిక్ గా మారిపోయింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ రీసెంట్ గా ఆదికేశవ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ మార్పు విషయంపై ప్రెస్ మీట్ నిర్వహించారు. వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్ కారణంగా ఆదికేశవ సినిమా డేట్ లో మార్పులు చేస్తున్నాము అని వివరణ ఇచ్చారు. అయితే ఇదే సమయంలో గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి.
ఆ సినిమా రిలీజ్ డేట్ విషయంలో అయితే ఎలాంటి మార్పులు లేవని అనుకున్న అందుకే వస్తుంది అని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా సంక్రాంతికి చాలా సినిమాలు పోటీలో ఉన్నాయి కాబట్టి నిర్మాతలు ఎవరైనా సంప్రదించరా గిల్డ్ తో కలిసి మాట్లాడారా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి ఇక ఆ విషయంలో వంశీ చాలా ధీమాగా సమాధానం ఇచ్చారు.
సంక్రాంతి సినిమాల్లో ఫస్ట్ ప్రియారిటి అందరికీ గుంటూరు కారం.. ఇక అలాంటి క్రేజ్ ఉన్నప్పుడు వేరే ఎవరైనా వచ్చి నన్ను అడగాలి. కానీ నేను రిలీజ్ విషయంలో ఎవరిని అడుగుతాను.. ఈ సినిమాకి ఎక్కువ స్థాయిలో క్రేజీ ఉంది.. అంటూ అందరూ దీన్నే చూడాలని అనుకుంటున్నారు అన్నట్లుగా నాగ వంశీ వివరణ ఇచ్చాడు. ఆయన కాన్ఫిడెన్స్ గట్టిగానే ఉంది కానీ పోటీలో ఉన్న మిగతా సినిమాలను తక్కువ అంచనా వేయడానికి అసలు వీలు లేదు.
ఇలాంటి ప్రశ్నలకు సింపుల్ గా అన్ని సినిమాలు ఆడాలి సంక్రాంతి అన్నప్పుడు ఈ మాత్రం పోటీ ఉంటుంది అన్నట్లు సమాధానం ఇస్తే సరిపోయేది. కానీ తమ సినిమాకి ఎక్కువ స్థాయిలో క్రేజ్ ఉంది అంటూ నాగ వంశీ వివరణ ఇవ్వడంతో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పోటీలో వెంకటేష్ సైంధవ్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కూడా కాస్త బజ్ ఉన్న సినిమాలే. ఇంకా హనుమాన్, రవితేజ ఈగల్, నాగార్జున నా సామి రంగా సినిమాలను కూడా తక్కువ అంచన వేయడానికి వీలు లేదు. మరి నాగవంశీ కాన్ఫిడెన్స్ కు తగ్గట్టుగా రాబోయే అప్డేట్స్ గుంటూరు కారం అప్డేట్స్ పై అంచనాలు పెరుగుతాయో లేదో చూడాలి.